ఈట‌ల‌ను ప‌ట్టించుకోని బీజేపీ.. హుజూరాబాద్‌లో సైలెంట్ వెన‌క కార‌ణమేంది..?

తెలంగాణ‌లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంత ఇంపార్టెంట్ విష‌య‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఇప్ప‌టికే ఇక్క‌డ టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

 Bjp Does Not Care About Eetala What Is The Reason Behind Silent In Huzurabad ,-TeluguStop.com

ఇక అనూహ్య ప‌రిణామాల క్ర‌మంలో మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరారు.అయితే అప్ప‌టి నుంచి కాస్త స‌పోర్టుగానే ఉన్న నేత‌లు మ‌ళ్లీ దూరం అవుత‌న్న‌ట్టు తెలుస్తోంది.

దీంతో ఆయ‌న కూడా ఒంటరిగానే రాజకీయాలు చేసేందుకు రెడీ అవుతున్నారంట‌.వాస్త‌వానికి ఈటల రాజేంద‌ర్ మొద‌టి నుంచి కూడా అందరినీ కలుపుకొని ముందుకు సాగే నేత‌.

టీఆర్ఎస్‌లో ఉన్న‌ప్పుడు కూడా పెద్ద‌గా ఎవ‌రితోనూ వైరం పెట్టుకోలేద‌ని చెప్పాలి.అలాంటి వ్య‌క్తి ఇప్పుడు బీజేపీలో మెల‌గ‌లేక‌పోతున్నాడేమో అనిపిస్తోంది.అందుకే చాలా రోజులుగా ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ నేతలు చేస్తున్న‌టువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలపై కూడా పెద్ద‌గా స్పందించ‌ట్లేద‌ని తెలుస్తోంది.ఇక ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఈటల రాజేంద‌ర్ నిర్వహిస్తున్న కొన్ని ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌కు కూడా ఆయ‌న దూరంగానే ఉంటున్న‌ట్టు తెలుస్తోంది.

కాగా ఆయ‌న మొద‌టి నుంచి కూడా ఎవ‌రి స‌పోర్టు లేకున్నా కూడా త‌న‌దైన స్టైల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు.

Telugu Bandi Sanjay, Eetala Rajender, Huzuraabad, Huzurabad, Sanjayprajha, Tg-Te

ఇక ఇప్పుడు కూడా పెద్ద‌గా ఎవ‌రిని ప‌ట్టించుకోకుండా ముందుకే సాగుతున్నారు.ఇక ఈట‌ల రాజేంద‌ర్ చేప‌ట్టిన పాదయాత్రకు కూడా పెద్ద‌గా బీజేపీ నేత‌లు హాజ‌రు కాలేదు.అయినా కూడా ఇది పెద్ద‌గా ఈటల పాద‌యాత్ర‌పై ఇంపాక్ట్ చూపించ‌లేద‌నే చెప్పాలి.

ఇక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్రపై కూడా ఈటల రాజేంద‌ర్ ఎలాంటి కామెంట్లు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.ఇక బీజేపీ వాదాన్ని కూడా ఆయ‌న బ‌లంగా వినిపించ‌ట్లేదు.

ఇంకా చెప్పాలంటే అస‌లు హిందువులు అనే మాట కూడా ఆయ‌న నోటినుంచి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube