మీకు తెలుసా ఇండియాలో కరోనా ఎప్పుడో పోయిందట

ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదు అయితే నెం.2 గా ఇండియా ఉంది.త్వరలోనే ఇండియా నెం.1 స్థానంకు చేరుతుంది అనడంలో సందేహం లేదు.కరోనా కేసులు రోజుకు కాస్త తక్కువ లక్ష వరకు నమోదు అవుతున్నాయి.ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉండటంతో పాటు ప్రజలు కూడా వారిని వారు రక్షించుకునేందుకు ప్రయత్నాలు చేయాలి.

 Bengal Bjp President Dilip Ghosh Says Corona Has Gone, Bjp, Dilip Ghosh, Coronav-TeluguStop.com

ప్రజలను ఎడ్యుకేట్‌ చేయడంలో రాజకీయ నాయకులు ఈ సమయంలో క్రియాశీలకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కాని పశ్చిమ బెంగాల్‌ కు చెందిన బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపుతున్నాయి.

ఆయన కరోనా అసలు ఇండియాలో లేనే లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన దిలీప్‌ ఘోష్‌ ఇటీవల ఒక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.

దేశంలో కరోనా వైరస్‌ ఎప్పుడో పోయంది.కాని ముఖ్యమంత్రి మమత బెనర్జి మాత్రం పార్టీల హక్కులను కాలరాస్తూ సమావేశాలు పెట్టకూడదు అంటూ ఆంక్షలు విధిస్తుంది.

లాక్‌ డౌన్‌ను అమలు చేస్తుంది అంటూ ఆయన విమర్శలు చేశాడు.కరోనా కనిపించకుండా పోయినా బీజేపీ మీటింగ్‌ కు సీఎం అనుమతించలేదు అంటూ ఆయన ఆరోపించాడు.

ఆయన వ్యాఖ్యలు సొంత పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు కూడా విస్మయంను కలిగిస్తున్నాయి.రోజుకు లక్షల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతుంటే దేశంలో కరోనానే లేదు అంటూ ఈయన ఎలా అంటాడు అంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube