పుర ఎన్నికల్లో పారని బీజేపీ పాచికలు... ఎందుకంటే?

తెలంగాణలో త్వరలో పుర ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఎన్నికలను కరోనా విజ్రుంభిస్తున్న సమయంలో నిర్వహించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది.

 Bjp Dice Not Lost In Pura Elections Because  Bjp Party, Mp Bandi Sanjay , Ts Pol-TeluguStop.com

కాని ప్రభుత్వం, ఎన్నికలను నిర్వహించాలని కృత నిశ్చయంతో ఉండడంతో ఇక ప్రతిపక్షాలు కూడా ఎన్నికల నిర్వహణకు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఉంది.అయితే ఈ ఎన్నికలు క్షేత్ర స్థాయిలో జరిగే ఎన్నికలు.

ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేయవు.క్షేత్ర స్థాయిలో సమస్యల మీద ఆధారపడి పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి.

అయితే ఈ పుర ఎన్నికల బరిలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ లు ఉన్నాయి.కాంగ్రెస్ పరిస్థితి ఒక వైపు ఉంచితే బీజేపీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.

కాని బీజేపీ వేసిన పాచికలు పారనట్టు తెలుస్తోంది.ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నిక తరహా రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేకపోవడం ఒక కారణమైతే టీఆర్ఎస్ పై ఇప్పుడు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు.

కేసీఆర్ తీసుకుంటున్న కొన్ని ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల్లో కొంత కేసీఆర్ అనుకూల వాతావరణం ఉంది.అయితే కేసీఆర్ పై విమర్శలు చేద్దామా అంటే బీజేపీ విమర్శలను అసలు ప్రజలు పట్టించుకోవడం లేదు.

ఇవన్నీ బీజేపీకి ప్రతికూల వాతావరణం ఉన్న పరిస్థితులలో బీజేపీ పాచికలు పారి సత్తా చాటే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube