జై భీం దీక్షల పేరుతో బీజేపీ హంగామా... నష్ట నివారణ చర్యలో భాగమేనా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్షాల మాటలమధ్య తూటాలతో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి ఉంది.తాజాగా కేంద్ర బడ్జెట్ పై కెసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశం వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగింది.

 Bjp Commotion In The Name Of Jai Bhim Diksha Is It Part Of The Damage Mitigatio-TeluguStop.com

అయితే ఇక దేశ రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించిన కెసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున గందరగోళంగా మారిన విషయం తెలిసిందే.అయితే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందన్న భావన పూర్తి స్థాయిలో కెసీఆర్ వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్రంలో బీజేపీ అవలంబిస్తున్న విధానంపై కూడా చాలా వరకు తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

బీజేపీ జీవో 317 పై చేసిన అభ్యంతరం పట్ల రాష్ట్ర యువకులకు అర్ధమైన రీతిలో స్పష్టం చేయడంతో ఇక ఇటు బడ్జెట్ పై కాని, బీజేపీపై చేసిన వ్యాఖ్యల పట్ల గాని బండి సంజయ్ మరియు ఇతర నేతలు కనీసం కెసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన పరిస్థితి లేదు.

Telugu @bjp4telangana, @cm_kcr, Bandi Sanjay, Bjp, Budget, Telangana-Political

దీంతో ఇప్పటి వరకు బీజేపీకి మద్దతిచ్చిన మెజారిటీ నిరీడయోగా యువకులు కొంత ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.ఎందుకంటే నోటిఫికేషన్ ల అలస్యానికి గల కారణం, 317 జీవోతో కలిగే లాభాలను చాలా వరకు క్లారిటీ ఇవ్వడంతో ఒక్కసారిగా అప్పటివరకు రాష్ట్రంలో హాట్ హాట్ కామెంట్స్ తో కొంత వార్తల్లో నిలిచిన బీజేపీ కెసీఆర్ కామెంట్స్ తో ఎక్కడో రాజకీయ లాభం కొరకు జీవోకి సంబంధించిన పూర్తి సమాచారం లేకుండా తప్పు దోవ పట్టించారనే చర్చ నిరుద్యోగుల్లో జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అందుకే నష్ట నివారణ చర్యలో భాగంగా రాజ్యాంగ మార్పు ప్రస్తావనను చర్చలో తీసుకొస్తూ జైభీం దీక్షలు చేపడుతున్నారనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube