సరికొత్త రాగం ఎంచుకున్న బీజేపీ... రైతుల మద్దతు దక్కినట్టేనా?

ప్రస్తుతం తెలంగాణలో అత్యంత బలంగా ఏదైనా పార్టీ ఉంది అంటే అదొక్క టీఆర్ఎస్ మాత్రమే.టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఏ పార్టీ అనేది గట్టిగా నమ్మకంగా చెప్పలేని పరిస్థితి.

 Bjp Chooses Latest Tune Do Farmers Get Support, Bjp Party, Bandi Sanjay-TeluguStop.com

ఎందుకంటే చాలా రకాల సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లో పలుచనైన పరిస్థితి ఉంది.ఇక బీజేపీ పార్టీకి అసలు బలమైన క్యాడర్ లేనటువంటి పరిస్థితి ఉంది.

ఎందుకంటే ఏదో ఒక బూమ్ లా దుబ్బాకలో గెలిచి ఇక ఆ తరువాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఘోరంగా డిపాజిట్లు సైతం గళ్ళంతైన విషయం తెలిసిందే.

ఇన్ని రోజులు మౌనం వహించిన బీజేపీ ఒక్కసారిగా మరల దీక్ష రాగం ఎత్తుకుంది.

రైతుల ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ దీక్షకు పిలుపునిచ్చింది.అంతేకాక ఇప్పటి వరకు రైతులకు రుణ మాఫీ చేయలేదని, రైతు బంధు నగదును తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేసారు.

అయితే బీజేపీ దీక్షకు రైతుల మద్దతు ఇచ్చారా లేదా రాజకీయ దురుద్దేశ్యంతో చేస్తున్న దీక్షగా అర్థం చేసుకున్నారా అనేది ఇప్పుడు అప్రస్తుతం అయినప్పటికీ రైతుల మద్దతు ఉంటేనే బీజేపీ దీక్షకు ఫలితం లభిస్తుంది.లేకుంటే దీక్ష ఫలితం శూన్యం అని చెప్పకతప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube