విషమంగా మారిన యూపీ మంత్రి పరిస్థితి,వెంటిలేటర్ పై....

కరోనా రోజు రోజుకు జనాల గుండెల్లో దడ పుట్టిస్తుంది.దేశవ్యాప్తంగా కరోనా విశ్వరూపం చూపిస్తూ జనాలకు పిచ్చెక్కిస్తుంది.

 Ex Indian Cricketer And Up Minister Chetan Chauhan Put On Ventilator, Health Con-TeluguStop.com

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు,ప్రజాప్రతినిధులు,మంత్రులు,క్రికెటర్లు ఇలా ఒక్కొక్కరు కరోనా బారిన పడుతూనే ఉన్నారు.దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కాగా, ఢిల్లీ,తమిళనాడు,ఉత్తరప్రదేశ్,ఏపీ,తెలంగాణా ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రోజు తన విశ్వరూపం చూపిస్తుంది.

మొన్నటికి మొన్న యూపీ మహిళా మంత్రి కమల్ రాణి కరోనా తోనే మృతి చెందిన సంగతి తెలిసిందే.అయితే ఇంకా ఆ ఘటన మరువక ముందే మరో యూపీ మంత్రి టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ కూడా కరోనా బారిన పడగా, తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తుంది.

గతనెలలోనే ఆయనకు కరోనా సోకగా లక్నో లోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.అయితే ఆయన చికిత్స పొందుతున్న సమయంలోనే ఇతర ఆరోగ్య సమస్యలు బీపీ తో పాటు కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తడం తో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

దీనితో ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.చేతన్ చౌహన్ టీమిండియా తరపున పలు టెస్ట్ లు,వన్డేలు ఆడి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అనంతరం రాజకీయాల్లో అడుగుపెట్టి బీజేపీ పార్టీ నేతగా ఎదిగి ప్రస్తుతం యోగి క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉండడం తో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

మరోపక్క ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా,అలానే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ లు కరోనా బారిన పడి కోలుకోగా, మరో కేంద్ర మంత్రి లవ్ అగర్వాల్ కూడా కరోనా బారిన పడిన విషయం విదితమే.ఇలా వరుసగా బీజేపీ శ్రేణులలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవ్వడం ఆందోళన కలిగిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube