జగన్ కు ఇక మంచి రోజులే ! బీజేపీకి మరో ఆప్షన్ లేనట్టే ?  

bjp central leaders take key desistion about jagan nda ,bjp, ysrcp, jagan ,ap cm, narendra modhi, sivasena, akalidal ramvilaspasvan, rajyasabha ,amithshah - Telugu Akalidal Ramvilaspasvan, Amithshah, Ap Cm, Bjp, Jagan, Narendra Modhi, Nda, Rajyasabha, Sivasena, Ysrcp

ఒక్కోసారి నెత్తిన పెట్టుకుంటూ, మరోసారి పాతాళానికి తొక్కే స్తూ, జగన్ విషయంలో కేంద్ర అధికార పార్టీ బిజెపి ఒక్కో సందర్భంలో, ఒక్కో విధంగా వ్యవహరిస్తూ వస్తోంది.అయినా జగన్ మాత్రం అన్ని అవమానాలను దిగమింగుకుని మరీ బీజేపీతో సఖ్యత గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

TeluguStop.com - Bjp Central Leaders Take Key Desistion About Ys Jagan

కీలకమైన బిల్లులు ఓటింగ్ సమయంలో వైసీపీ ఎంపీలు బీజేపీ వైపు నిలబడుతూ అండగా ఉంటూ వస్తున్నారు.బీజేపీకి అనుకూలంగా ఉండటం ద్వారా, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు, ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు కేంద్ర ఆర్థిక  అండదండలు సంపాదించవచ్చని, అలాగే కొన్ని పరిపాలనా పరమైన నిర్ణయాల విషయంలో కేంద్రం సహకరిస్తుంది అనే ఉద్దేశంతో జగన్ వారితో సఖ్యతను కొనసాగిస్తూ వస్తున్నారు.

ఏపీలో బిజెపి, వైసీపీని ప్రధాన శత్రువుగా చూస్తూ, టార్గెట్ చేసుకుంటూ వస్తోంది.అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించాలని తాపత్రయపడుతున్నారు.ఇప్పటి వరకు జగన్ ను దూరం దూరంగానే పెడుతూ వస్తున్న బీజేపీ కేంద్ర పెద్దలు ఇప్పుడు మాత్రం జగన్ కి ప్రాధాన్యమిచ్చే అవకాశం కనిపిస్తోంది.దీనికి కారణం కేంద్రంలో తమకు తిరిగే లేదు అనుకుంటూ వస్తున్న ఎన్డీఏ కూటమి బలం ఇప్పుడు బాగా తగ్గిపోయింది.

TeluguStop.com - జగన్ కు ఇక మంచి రోజులే బీజేపీకి మరో ఆప్షన్ లేనట్టే -Political-Telugu Tollywood Photo Image

ఇప్పటికే శివసేన దూరమైంది.అలాగే శిరోమణి అకాలీదళ్ పార్టీ కూడా దూరమైంది.

కొద్ది రోజుల క్రితం మంత్రి పదవిని సైతం వదులుకుంది.

తాజాగా ఎన్డీయే నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో బిజెపిలో కంగారు మొదలైంది.

లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కూడా ఎన్డీఏకు దూరం అవ్వాలని చూస్తున్నట్లుగా బీజేపీకి సమాచారం అందింది.ఇలా వరుసగా అందరు దూరమైతే, రానున్న రోజుల్లో కేంద్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కీలకమైన బిల్లులను ఆమోదించుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే ఇప్పుడు తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో స్నేహం చేయాలని బిజెపి ప్రయత్నిస్తోంది.

దీనిలో భాగంగానే కేంద్ర బిజెపి పెద్దలు జగన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే వైసీపీని ఎన్డీయేలోకి తీసుకుని మంత్రి పదవులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.రాష్ట్రం సంగతి పక్కన పెడితే, కేంద్రంలో మీకు అన్ని రకాలుగా సహాయం అందిస్తామని, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి మద్దతు తెలుపుతామని కేంద్ర బీజేపీ పెద్దలు ఇప్పటికే జగన్ కు కబురు పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది.

రాజ్యసభలో ఎన్డీఏ కు మెజార్టీ లేకపోవడం, జగన్ కు రాజ్య సభలో మెజారిటీ ఉండడం ఇవన్నీ లెక్క వేసుకుంటున్న బిజెపి కేంద్ర ప్రజలు జగన్ కు మరింత ప్రాధాన్యం పెంచాలనే విధంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపై ఏపీ తోపాటు కేంద్రంలోనూ జగన్ కు ఏ ఇబ్బంది లేకుండా భరోసా ఇచ్చే విధంగా జగన్ కు కబురు పంపే ఆలోచనలో ఉన్నారట.

ఇప్పుడు శరవేగంగా బిజెపి జగన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర పెద్దలు మంతనాలు చేస్తున్నట్లుగా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ఒకవేళ ఎన్డీఏలోకి వైసీపీని ఆహ్వానిస్తే, దీనిపై జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనే విషయం కూడా ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది.

#Sivasena #Narendra Modhi #Jagan #AP Cm #Amithshah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bjp Central Leaders Take Key Desistion About Ys Jagan Related Telugu News,Photos/Pics,Images..