తాము పూర్తి న్యాయబద్దంగా వ్యవహరించాం

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒక వైపు శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీలు అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండగా రాష్ట్రపతి పాలన విధించడం వెనుక రాజకీయ కారణం ఉందేమో అంటూ కాంగ్రెస్‌ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 Bjp Central Home Minister Amith Shaw Intresting Comments On Maharastra Governam-TeluguStop.com

రాష్ట్రపతి పాలన సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే హోం మంత్రి అమిత్‌ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడం పూర్తిగా గవర్నర్‌ నిర్ణయంపై ఆధారపడి ఉందని, ఆయన నిర్ణయం మేరకు రాష్ట్రపతి పాలన విధించినట్లుగా చెప్పాడు.అన్ని పార్టీలకు కూడా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చాం.18 రోజుల పాటు అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు టైం ఇచ్చాం.కాని అక్కడ ప్రభుత్వ ఏర్పాటు కాకపోవడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందంటూ ఈ సందర్బంగా అమిత్‌ షా అన్నాడు.

రాజ్యాంగంను కాలరాయలేదని, ఏ ఒక్కరి విజ్ఞప్తిని కాదని రాష్ట్రపతి పాలన విధించలేదంటూ ఆయన పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube