“పవన్” తిరుమల యాత్ర వెనుక… “బీజేపి భారీ స్కెచ్”       2018-05-14   23:54:48  IST  Bhanu C

పవన్ కళ్యాణ్…మీడియా ఇష్యు నుంచీ బయటపడి ఇప్పుడు అందరిని డైవర్ట్ చేస్తూ తిరుమల కొండ ఎక్కుతూ…తానొక సామాన్య వ్యక్తిలా అందరికి కనపడేలా చాలా చాకచక్యంగా ప్రవర్తిస్తూ ఒక ఈవెంట్ లా తన పర్యటనని మలుచుకున్నాడు మీడియా దృష్టిని సైతం ఆకట్టుకున్నాడు.. మరో రెండు రోజులు ఇదే తరహాలో తన ఫందా సాగే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఇంత హడావిడిగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత హంగామా సృష్టించాడు అనే విషయం ఎవరూ ఆలోచించలేదు..కానీ పవన్ ఈ హడావిడి వెనుక అసలు స్టోరీ ఏమిటంటే..

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు సామాన్య భ‌క్తుల‌తో క‌లిసి కాలినడకన శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.. పవన్ కి తోడుగా భారీ ఎత్తున అభిమానులు సైతం రావడంతో పవన్ టూర్ కి మంచి స్పందన ఏర్పడింది…అయితే ఒక్కసారి పవన్ కళ్యాణ్ పర్యటన సారాంశం పరిశీలిస్తే ఈ రోజు కొండ‌పై ఉన్న కొన్ని క్షేత్రాల‌ను సందర్శించారు. మీడియాతో మాట్లాడిన పవన్ శ్రీవారి క్షేత్రంలో ఉన్న యోగ నర‌సింహ‌స్వామి స‌న్నిధిలో త‌న‌కు అన్న‌ ప్రాస‌న‌ను జ‌రిపిన‌ట్లు త‌న త‌ల్లిదండ్రులు త‌రచు గుర్తు చేసేవార‌న్నారు..అయితే

జనసేనుడు తిరుమలలోనే రెండు రోజుల నుంచీ తిష్ట వేయడం వెనుక భారీ రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు…ఇది కుడా ఆపరేషన్ గరుడ లో భాగమేనని… ఈ నేపధ్యంలో పవన్ తిరుమలలోనే ఉండి ఆ ఎన్నికల్లో బిజెపి కనుక విజయం సాధిస్తే మాత్రం, బస్సు యాత్రపై అక్కడే ఒక ప్రకటన చేసి తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు సొంత జిల్లా నుంచే యుద్ధం ప్రకటించనున్నాడని టాక్ వినిపిస్తోంది…ప్రభుత్వ అవినీతి మీదే ఎక్కువగా దృష్టి పెట్టి, చంద్రబాబు, లోకేష్ లని భారీగానే టార్గెట్ చేయనున్నాడట..

అయితే పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లడం, అక్కడే కర్ణాటక ఎన్నికలు వచ్చే వరకూ తిష్ట వేయడం ఇలా అన్నీ కేంద్రం కనుసన్నల్లో జరుగుతోందని అంటున్నారు అయితే కేవలం చంద్రబాబు ని టార్గెట్ చేసి ఏపీ కి అసలు అన్యాయం చేసిన మోడీ ని కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనకపోతే చంద్రబాబు డ్యామేజ్ గురించి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కి మాత్రం అంతకంటే భారీ స్తాయిలో డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు.