ప‌వ‌న్ మౌనం వెన‌క క‌మ‌ల‌నాథుల వ్యూహం.. కానీ ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు ఆగ‌ట్లేదే..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ మూవీస్, పాలిటిక్స్ రెండూ చేస్తున్నారు.జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు ప్రణాళికలు రచిస్తూనే, సినిమాలు చేస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

 Bjp Strategy Behind Pawan Kalyan Silence, Pawan Kalyan, Hari Hara Veeramallu, Ay-TeluguStop.com

అయితే, అధికారం అంతిమం కాదని, ప్రశ్నించడమే తన కర్తవ్యమని పేర్కొన్న పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై ప్రస్తుతం తన గళం వినిపించడం లేదని విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పలు పరిణామాలపైన ఆయన ప్రెస్‌నోట్స్ రిలీజ్ చేయడం తప్ప పవన్ తన గళం వినిపించిన దాఖలాలు అయితే లేవు.

కేవలం ప్రెస్‌నోట్స్ విడుదల చేయడం ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? అని ప్రశ్నిస్తున్నారు.ఇకపోతే పవన్ మౌన ముద్ర దాల్చడం వెనుక కమలనాథుల వ్యూహాలు ఉన్నాయని పేర్కొనే వారు ఉన్నారు.

అయితే, తెలంగాణ, ఏపీలో ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని భావించిన పవన్ ఏపీ సమస్యలపైన కాన్సంట్రేట్ చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీతో జతకట్టిన తర్వాత పవన్ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

అమరావతి రైతుల గురించి కానీ, రాజధాని గురించి కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు కానీ పవన్ గళం వినిపించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.ఈ సంగతులు ఇలా ఉండగా పవన్ ప్రస్తుతం సినిమాల బిజీలో ఉన్నారని తెలుస్తోంది.

Telugu Ap, Bjpstrategy, Harihara, Janasena, Pavan, Pawan Kalyan-Telugu Political

‘వకీల్ సాబ్’‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ‘హరిహరవీరమల్లు’ చిత్రంలో తన షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని సీన్ల చిత్రీకరణలో పాల్గొన్నారు పవన్.ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ షూట్‌లో ఉన్నట్లు సమాచారం.ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా, సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube