కర్ణాటకలో మళ్ళీ కంగుతిన్న బీజేపీ !       2018-05-29   03:45:49  IST  Bhanu C

కర్ణాటకలో రాజకీయం అడ్డం తిరిగి పొగరెక్కి ఉన్న బీజీపీ పెద్దల అహం మొత్తం అణిచేసింది. అందుకే తమ దగ్గర ఉన్న డబ్బు వెదజల్లి ఎలా అయినా కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలనుకున్న నక్క జిత్తులను ఉన్నత న్యాయస్థానం కూడా అడ్డుకుంది. దీంతో కంగుతిన్న ఆ పార్టీ అధికారం చేపట్టిన నాలుగురోజుల్లోనే రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంది. అంతటితో ఆగితే పర్వాలందు కానీ అహం నెత్తికెక్కిన ఆ పార్టీ పెద్దలు ఊరికే ఉంటారా..?

ఏదో ఒక రాజకీయం చేసి కర్ణాటక లో అలజడి సృష్టించాలని చూస్తున్నారు…జేడీఎస్ అధికారంలోకి వ‌స్తే రైతు రుణ‌మాఫీ చేస్తాన‌ని ఆ పార్టీ అధ్య‌క్షుడు కుమార స్వామి ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చారు. అయితే, ఆయ‌న‌కు కేవ‌లం 38 సీట్లే వ‌చ్చాయి. దీంతో పార్టీ అధికారంలోకి వ‌చ్చే మెజారిటీకి చాలా దూరంలో ఉండిపోయింది. అయితే, బీజేపీని నిలువ‌రించే ప్ర‌య‌త్నంలో కాంగ్రెస్ ఆ పార్టీకి సంపూర్ణ మ‌ద్దతు ఇచ్చి కుమార‌స్వామిని ముఖ్యమంత్రిని చేసింది. సీఎం పోస్టు అయితే ద‌క్కింది గాని కుమార‌స్వామి భ‌విష్య‌త్తు మొత్తం కాంగ్రెస్ చేతుల్లో ఉండిపోయింది.

ఈ నేప‌థ్యంలో కుమార‌స్వామిని మ‌రింత ఇరుకున పెట్ట‌డానికి బీజేపీ రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చింది. జేడీఎస్ అధ్య‌క్షుడు, సీఎం కుమారస్వామి మాట నిల‌బెట్టుకోలేద‌ని, రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నాడని ఆరోపిస్తూ కర్ణాటక బీజేపీ నేతలు రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చారు. అయితే, 53 వేల కోట్ల రుణాల మాఫీని డిమాండ్ చేస్తూ వారు ఇచ్చిన బంద్ పిలుపునకు రాష్ట్రంలో క‌నీస స్పంద‌న కూడా ద‌క్క‌లేదు. సాధార‌ణంగా బంద్ ప్ర‌భావం మొట్ట‌మొద‌ట స్కూళ్లు, ర‌వాణాపై ఉంటుంది. కానీ

బిజేపే నక్క జిత్తులు పారలేదు అవ‌న్నీ మామూలుగానే యధాప్రకారం న‌డిచాయి. అస‌లు బంద్ వాతావ‌ర‌ణ‌మే ఎక్క‌డా క‌నిపించలేదు. దీంతో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఘోర అవమానం జరిగినట్టు అయ్యింది, తల కొట్టేసినట్టుగా అయ్యిపోయింది..అంతేనా రైతుల కోసం చేసిన ఈ బంద్ కు కనీసం రైతుల నుంచి కూడా మద్దతు లభించలేదు. దీంతో ప్రజల నుంచి మద్దతు లేకపోగా అవమానం మాత్రం మిగిలిందని కర్ణాటక బీజేపీ నాయకులు లబో దిబో అంటున్నారు.అసలే ఎన్నికల్లో సీటు ఇలా చేతికి వచ్చినట్టుగా వచ్చి మళ్ళీ అలా పోయి పుట్టెడు బాధలో ఉన్న బిజేపికి ఈ పరిణామం మింగుడు పడటం లేదు.