పవన్ డామినేషన్ తో వీర్రాజు ఇమేజ్ డ్యామేజ్  ?

జనసేన బీజేపీ కలిసి ఏపీలో అధికారం పంచుకోవాలని ఎన్నో కలలుకంటున్నాయి.మరెన్నో రకాలుగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 Modhi, Pavan, Janasena, Ysrcp ,prime Minister, Ap ,somu Veeraju-TeluguStop.com

బీజేపీ రాజకీయ బలానికి తోడు, పవన్ అభిమానుల బలానికి ఎదురే ఉండదని, రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి అధికారం దక్కించుకోవాలని, ఎన్నోరకాలుగా కలలు కంటున్నారు.ఈ మేరకు ఏపీ బీజేపీ- జనసేన కలిసి ఎన్నో కార్యక్రమాలు ఉమ్మడిగా చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే కొంత కాలంగా బీజేపీ తమతో వ్యవహరిస్తున్న తీరుతో పవన్ ఆగ్రహంగా ఉన్నా, తెగతెంపులు చేసుకునేందుకు మాత్రం ఆయన ఇష్టపడడం లేదు.బీజేపీ మూడు రాజధానులకు పరోక్షంగా మద్దతు పలికింది.

ఈ విషయంలో ఇప్పటికే పవన్ జగన్ నిర్ణయానికి వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పాటు,  ఈ విషయంలో బీజేపీ తమతో కలిసి రాకపోయినా, సొంతంగానే అమరావతి ఉద్యమాన్ని చేపట్టేందుకు జనసేన సిద్ధమవుతోంది.అలాగే, పార్టీలో పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించడంతో పాటు, నియోజకవర్గాల వారీగా ఇంచార్జీలను నియమించి, మరింతగా బలపడాలని చూస్తున్నారు.

బీజేపీతో పొత్తు ఉన్నా, లేకపోయినా తమకంటూ సొంత బలం పెంచుకుంటే, రానున్న రోజుల్లో బీజేపీ తమను పక్కన పెట్టేస్తే పరిస్థితి ఏమిటనేది పవన్ కు ఏమత్రం అర్థం కావడం లేదు.అది కాకుండా, బీజేపీ గత కొంతకాలంగా తమతో వ్యవహరిస్తున్న తీరు పవన్ కు అర్థం కావడం లేదు.

తాము బీజేపీత కలిసి అడుగులు వేయాలని చూస్తుంటే, ఆ పార్టీ వైసీపీతో సఖ్యతగా ఉండడాన్ని పవన్ తట్టుకోలేకపోతున్నారు.కొద్ది రోజులుగా పవన్ వ్యవహారశైలిని చూస్తే గణనీయమైన మార్పు కనిపిస్తోంది.

బీజేపీ తో సంబంధం లేకుండానే బీజేపీ వ్యవహారాల్లోనూ పవన్ తలదాచుకున్నట్లు గా కనిపిస్తున్నారు.జగన్ ప్రవేశపెట్టిన విద్య కానుక విషయంలో కేంద్రం వాటా 60 శాతం ఉండడాన్ని పవన్ హైలెట్ చేస్తున్నారు.

ఈ పథకానికి మోదీ జగన్ కానుక అని ప్రకటిస్తే బాగుండేదనే విషయాన్ని పవన్ గట్టిగా డిమాండ్ చేయడంతో సోము వీర్రాజు ఇరుకున పడిపోయినట్లు తెలుస్తోంది.

కాకపోతే ఈ విషయాన్ని బిజెపి నాయకులు హైలెట్ చేసి, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయాలి.

కానీ ఈ విమర్శలను బీజేపీ కంటే ముందుగానే పవన్ హైలెట్ చేయడంతో వీరాజు ఇమేజ్ కు డ్యామేజ్ ఏర్పడినట్టుగా వీర్రాజు సన్నిహితులు వాపోతున్నారు.కేంద్రంలో వైసీపీ అవసరం బీజేపీకి ఉండడంతో బీజేపీ అగ్ర నాయకులు జగన్ ను చేరదీస్తున్నారని, అందుకే పవన్ చూపించినంత దూకుడును ఆయన చూపించలేకపోతున్నారు వీర్రాజు వర్గీయులు చెబుతున్నారు.

ముందు ముందు కూడా బిజెపి ని పక్కన పెట్టి ఇరుకున పెట్టే విధంగా పవన్ వ్యవహరించే అవకాశం ఉందనే అనుమానాలు ఏపీ బీజేపీ నాయకులను వెంటాడుతున్నాయి.కేంద్రంలో తమకు మద్దతు అవసరమవ్వబట్టే వైసీపీకి సన్నిహితంగా ఉంటున్నామని, కానీ పవన్ ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా, బిజెపి కి మైలేజ్ తెచ్చే విధంగా వ్యవహరిస్తుండడంతో, అసలు ఈ రెండు పార్టీలు మిత్రపక్షంగా ఉన్నాయా లేదా అనే విషయం జనాల్లోనూ, అనేక అనుమానాలు పెంచుతున్నాయని వీర్రాజు ఆవేదన చెందుతున్నట్లు గా తెలుస్తోంది.

తమ మిత్రపక్షమైన జనసేన తమను మించి పోయే విధంగా  వ్యవహరించడం వంటి పరిణామాలు బిజెపికి ఆందోళన కలిగిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube