పాతబస్తీలో పట్టుకు బీజేపీ మరో వ్యూహం...సఫలమయ్యేనా?- Bjp Another Strategy To Hold On To The Old Town Will It

BJP another strategy to hold on to the old town will it succeed akbaruddin, bjp ,mim ,bjp ,ts poltics,patha basthi - Telugu @bandisanjay_bjp, #aimim, Aimim Chief Asaduddin Owaisi, Akbaruddin, Ts Poltics

తెలంగాణలో బీజేపీ ఎక్కడ బలపడాలనుకున్నా రకరకాల వ్యూహాల్ని ప్రయోగించి బలపడవచ్చు.అయితే బీజేపీ వ్యూహానికి అక్కడ అవకాశం దొరకని ఒకే ఒక్కటి పాతబస్తీ.

 Bjp Another Strategy To Hold On To The Old Town Will It-TeluguStop.com

ఎందుకంటే ఎంఐఎం ఎంతలా పాతబస్తీలో పట్టు సాధించిందో మనం ప్రత్యేకంగా చర్చించుకోనక్కరలేదు.ఎంఐఎం ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంటుంది.

ఎందుకంటే అక్కడ ముస్లిం ప్రాబల్యం ఎక్కువ.అందుకే బీజేపీ పాచికలు అక్కడ పారవు.

 Bjp Another Strategy To Hold On To The Old Town Will It-పాతబస్తీలో పట్టుకు బీజేపీ మరో వ్యూహం…సఫలమయ్యేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే బీజేపీ హిందుత్వపు పార్టీ అంతేకాక ఎంఐఎం పార్టీని ఎక్కువగా తీవ్ర విమర్శలు చేసేది కూడా బీజేపీనే.

కావున అక్కడ ఉన్న ముస్లింలకు బీజేపీ అంటే ముస్లింలకు వ్యతిరేక పార్టీ అనేది మనస్సులో నిలిచిపోయింది.

అందుకే బీజేపీకి అక్కడ అసలు కార్యకర్తల నిర్మాణం కాని, పార్టీ నిర్మాణం కాని సాధ్యం కాలేదు.అయితే పాతబస్తీలో పట్టు సాధించడానికి బీజేపీ ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

అయితే అక్కడ ఎంఐఎం అంటే వ్యతిరేకత కలిగి ఉన్న వారికి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించి అక్కడ బీజేపీ, ఎంఐఎం మధ్య రాజకీయ వేడి రాజుకోవాలన్నది బీజేపీ వ్యూహం.మరి ఈ వ్యూహమైనా ఫలించి బీజేపీ సత్తా చాటడానికి ప్రయత్నిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

అంతేకాక ఇప్పుడున్న పరిస్థితులలో పాతబస్తీలో కనుక పట్టు సాధిస్తే ఇక బీజేపీ తెలంగాణలో పట్టు సాధించిందనే సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది.

#AIMIMChief ##AIMIM #Akbaruddin #Ts Poltics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు