నాటకాలు ఆడుతున్నారా..? బీజేపీ- టీడీపీ బంధం కొనసాగుతోందా..?  

Bjp And Tdp Playing Political Game-

కేంద్ర అధికార పార్టీ బీజేపీ , ఏపీ అధికార పార్టీ టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. నిత్యం ఏదో ఒక అంశంపై ఇరు పార్టీ నేతలు మైకుల ముందు తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. చంద్రబాబు ని ఇబ్బంది పెట్టాలని బీజేపీ , బీజేపీకి ఏపీ లో స్థానం లేకుండా చేయాలని టీడీపీ ఇలా పిల్లి ఎలుక ఆటలు ఆడుతున్నాయి..

నాటకాలు ఆడుతున్నారా..? బీజేపీ- టీడీపీ బంధం కొనసాగుతోందా..? -Bjp And Tdp Playing Political Game

అయితే అదంతా కేవలం పై పై నాటకాలేనని, ఈ రెండు పార్టీలు రహస్య స్నేహం కొనసాగిస్తున్నాయని , కేవలం రాజకీయ అవసరాల కోసమే తాత్కాలికంగా విడిపోయాయనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అవసరమైతే ఎన్నికల తరువాత బీజేపీతో కలవడానికి టీడీపీ సిద్దంగానే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఏపీలో కలకలం రేపిన ఐటీ దాడులనే పరిగణలోకి తీసుకుంటే… చంద్రబాబుకు బినామీగా అనుమానాలు వ్యక్తం అవుతున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై ఆదాయపు పన్ను, ఈడీ శాఖల అధికారులు నిర్వహించిన దాడులు కూడా అంత నిఖార్సయినవిగా భావించడానికి వీల్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తనపై దాడులు జరిగిన తరువాత కూడా రమేష్‌ విమర్శకులపై ధైర్యంగా మాటల దాడి చేస్తున్నారంటేనే ఆయన అక్రమాలు ఇప్పటికీ బయట పడలేదనే ధైర్యమే ఆయన్ను అలా మాట్లాడిస్తోందని అంటున్నారు.

వాస్తవంగా కేంద్రం టీడీపీని ఇబ్బంది పెట్టాలంటే… కొంతమంది నాయకులపై ఐటీ శాఖ దాడులు చేయడం కాదు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక కుంభకోణాలు , పథకాలు , ప్రాజెక్టులు ఇలా చెప్పుకుంటూపోతే … రాజధాని నిర్మాణంకోసం భూ సమీకరణ మొదలు, సింగపూర్‌ ఒప్పందాలు, నీటి పారుదల ప్రాజెక్టుల్లో వ్యయ అంచనాల పెంపు, అవినీతి. ఇలాంటివెన్నో ఉన్నాయి. న్ని కీలక శాఖల్లో జరిగిన ముడుపుల బాగోతంపై ఆయా మంత్రులపైనా, ఉన్నతాధికారులపైనా ఐటీ దాడులు జరిగి ఉండోచ్చు కానీ అవేమి జరగలేదు..

వాస్తవానికి చంద్రబాబు ఎన్టీయే ప్రభుత్వం నుంచి వైదొలిగిన కొంతకాలానికి నరేంద్రమోడీ తనపై ఏవైనా తీవ్రమైన చర్యలు తీసుకుంటారేమోనని, లేదా విచారణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాబుకు ఆయన కుమారుడు లోకేష్‌కు భయం పట్టుకుంది. దేశంలోని కార్పొరేట్‌ రంగాన్ని శాసిస్తూ ఉండటమే కాక, తెలుగు రాష్ట్రాల్లో మీడియా మొఘల్‌గా పేరొందిన ప్రముఖునితో దగ్గరి సంబంధాలున్న పారిశ్రామిక వేత్త ఒకరు మోదీ వద్దకు రాయబారం వెళ్ళి. ఎన్నికల తరువాత అవసరమైనపుడు చంద్రబాబు బీజేపీకే మద్దతు నిప్పించేలా చేసే బాధ్యత తనదే.

అని చెప్పి వచ్చారని తెలిసింది. దీంతో మోదీ కొంత సర్దుకున్నారని సమాచారం..

అందుకే ఇపుడు జరుగుతున్న ఐటీ దాడులు గురించి అంతగా భయపడాల్సిన పని ఏమీ లేదని బాబు తన కోటరీ నాయకుల దగ్గర ప్రస్తావించినట్టు సమాచారం.