ప‌వ‌న్‌కు మ‌రో బ్యాండ్ వేయ‌బోతోన్న బీజేపీ... అమిత్ షా స్కెచ్ వేసేశాడు ?

త్వ‌ర‌లో జ‌రిగే తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక ఏపీలో బీజేపీ  – జ‌న‌సేన మ‌ధ్య చిచ్చు పెట్టేలా ఉంది.ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ, జ‌న‌సేన రెండూ పోటీ ప‌డుతున్నాయి.

 Amit Shah Tirupathi Tour On March 4th, March4th, Amit Shah, Tirupathi By Electio-TeluguStop.com

ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీకి చెప్పుకోద‌గ్గ స్థాయిలో కూడా సీట్లు రాలేదు.జ‌న‌సేన మాత్రం క‌నీసం కాపులు ఉన్న చోట అయినా స‌త్తా చాటి కొన్ని సీట్లు అయినా గెలిచింది.

అయితే బీజేపీ మాత్రం కేంద్రంలో అధికారంలో ఉండ‌డంతో పాటు హిందూత్వ ఎజెండాను ఎత్తుకుని.ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రంగా ఉన్న తిరుప‌తిలో ఎలాగైనా పోటీ చేసి గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

ఈ రెండు మిత్ర‌ప‌క్ష పార్టీల్లో అక్క‌డ ఎవ‌రు పోటీ చేస్తార‌న్న దానిపై ఇంకా క్లారిటీ లేక‌పోయినా బీజేపీ మాత్రం జ‌న‌సేన‌ను ప‌క్క‌న పెట్టేసి ఈ సీటు మాదే అని ప్ర‌క‌టించుకుంటోంది.బీజేపీ తీరుతో రెండు పార్టీల మ‌ధ్య ఇప్ప‌టికే పొరా పొచ్చ‌లు కూడా వ‌చ్చాయి.

అస‌లు ఎవ‌రు పోటీ చేస్తారు ? అన్న‌ది తేల‌కుండానే తిరుపతి ఉప ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది.ఇదిలా ఉంటే కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా మార్చి 4న తిరుపతి పర్యటనకు వస్తారు.

దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం కానున్నారు.

Telugu Amit Shah, Amitshah, Amith Shah, Ap, Bjp Janasena, Janasena, Janasenani,

మార్చి 5న ఆయన బీజేపీ రాష్ట్ర నేతలతో సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ పోటీతో పాటు… ఆ పార్టీ అభ్య‌ర్థిగా ఎవ‌రిని పెడితే బాగుంటుంది ? అనే అంశంపైనే చ‌ర్చిస్తార‌ని తెలుస్తోంది.ఆధ్యాత్మిక కేంద్రంలో ఎలాగైనా పాగా వేసి త‌మ స‌త్తా చాటుకోవాల‌ని బీజేపీ చూస్తోంది.

గ‌తంలో ఇక్క‌డ బీజేపీ పోటీ చేసి గెలిచింది కూడా.అయితే అప్పుడు టీడీపీతో పొత్తు ఉంది.

ఇప్పుడు జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటోంది.ఈ రెండు పార్టీల పొత్తు ఇక్క‌డ పోటీ చేసే అభ్య‌ర్థికి ఎంత వ‌ర‌కు ప్ల‌స్ అవుతుంది అన్న‌ది చెప్ప‌లేం.

జ‌న‌సేన మాత్రం ఇక్క‌డ ప‌వ‌న్ అభిమానులు, కాపుల ఓట్లు ఎక్కువుగా ఉండ‌డంతో తామే పోటీ చేస్తామ‌ని చెపుతోంది.ఏదేమైనా ఇక్క‌డ బీజేపీ ప‌వ‌న్‌కు బ్యాండ్ వేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube