బీజేపీకి నిద్ర లేకుండా చేస్తున్న పవన్ కళ్యాణ్! అందుకే అతనిపై విమర్శలు

ఏపీ రాజకీయాలలో ఇప్పుడు ప్రజల ద్రుష్టి, అలాగే సిఎం సీటు టీడీపీ, వైసీపీ, జనసేన చుట్టూ తిరుగుతుంది.ఎ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయం ఒకప్పుడు రాజకేయ విశ్లేషకులు చెప్పినంత ఈజీగా ఇప్పుడు చెప్పలేకపోతున్నారు.

 Bjp Also Targeting On Pawan Kalyan-TeluguStop.com

సామాజిక సమీకరణాలు ఎవరికి లాభిస్తాయో అనే విషయం కూడా స్పష్టత రావడం లేదు.అయితే ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చే ఏపీ ప్రజలు ఇప్పుడు హంగ్ వైపు చూస్తున్నారా అంటే అవుననే మాట రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తుంది.

దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్.జనసేన పార్టీతో ఏపీ రాజకీయాలలో తనదైన శైలిలో దూసుకుపోతూ ఎక్కువగా యువతని ఆకర్షిస్తున్న పవర్ స్టార్ కి బలమైన సామాజిక వర్గం అండ కూడా పుష్కలంగా ఉంది.

దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడంతో పాటు, తటస్థ ఓటు బ్యాంకుని కూడా తనవైపు లాగీసుకుంటున్నాడు అనే అభిప్రాయం రెండు ప్రధాన పార్టీలలో ఉంది.దీంతో ఆ రెండు పార్టీలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడి చేసి ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి.

దీని కోసం కోట్ల రూపాయిలు డబ్బులు ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు.

ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికలలో ఎ మాత్రం ప్రభావం చూపించలేని బీజేపీ పార్టీ లోపాయకారిగా వైసీపీతో బంధం ఏర్పరుచుకొని జగన్ ని వెనకుండి నడిపిస్తుంది అనే టాక్ బలంగా వినిపిస్తుంది.దీనికి తగ్గట్లుగానే బీజేపీ పార్టీ నేతలు వైసీపీకి గెలుపుకి అడ్డంకిగా మారిన జనసేనపైన విమర్శలు చేస్తున్నారు.రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ అయితే అదే పనిగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

అతను ప్యాకేజీ స్టార్ అంటూ దయ్యబడుతున్నారు.అయితే దీని వెనుక వైసీపీని గెలిపించాలనే వ్యూహం ఉందని అభిప్రాయం రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

అయితే ప్రత్యర్ధి పార్టీలు పవన్ కళ్యాణ్ ని ఎంత ఎక్కువగా విమర్శిస్తే అంతగా అతను ఇప్పుడు బలపడుతున్నాడు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube