బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్లాపే

తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడేళ్ల‌లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఓ రేంజ్‌లో జ‌రిగింది.తెలంగాణ‌లో విప‌క్ష పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అధికార టీఆర్ఎస్ గూటికి చేరిపోయాయి.

 Bjp Akarsh Turns Flop In Telangana-TeluguStop.com

ఇక ఏపీలో విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అధికార టీడీపీ చెంత‌కు చేరిపోయారు.వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌మ పార్టీల‌ను మ‌రింత బ‌లోపేతం చేసుకునే క్ర‌మంలోనే ఏపీలో టీడీపీ, తెలంగాణ‌లో టీఆర్ఎస్ ఇత‌ర పార్టీల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను త‌మ పార్టీలో చేర్చుకోవ‌డంతో పాటు వారికి ఏకంగా మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చాయి.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.ఈ రెండు పార్టీలు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ సూప‌ర్ హిట్ అయ్యింది.

ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో బ‌లోపేతం అవ్వాల‌నుకుంటోన్న బీజేపీ సైతం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌లేపింది.అక్క‌డ ఇత‌ర పార్టీల్లో ఉన్న అసంతృప్త నాయ‌కుల‌ను త‌న పార్టీలో చేర్చుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీలుంటే అధికారంలోకి రావ‌డం.లేనిప‌క్షంలో క‌నీసం కాంగ్రెస్‌ను ప‌క్క‌కు నెట్టేసి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ప్లేస్‌లోకి రావాల‌ని ప్లాన్ చేస్తోంది.

ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రుల‌తో పాటు ప్ర‌స్తుతం అక్క‌డ సీనియ‌ర్లుగా ఉన్న కొంద‌రు మాజీ మంత్రులు కం ఎమ్మెల్యేలపై వ‌ల వేసింది.ఈ జాబితాలో డీకే అరుణ‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, జీవ‌న్‌రెడ్డి లాంటి వాళ్లు ఉన్నారు.

వీరితో బీజేపీ జాతీయ నాయ‌కులు చ‌ర్చ‌లు జ‌రిపారు కూడా.అయితే తెలంగాణ‌లో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తెలంగాణ టూర్ అట్ట‌ర్ ప్లాప్ కావ‌డంతో ఒక్క కాంగ్రెస్సే కాదు .ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లు కూడా టీ బీజేపీలోకి వ‌చ్చేందుకు అస్స‌లు ఆస‌క్తి చూప‌డం లేదు.

జాతీయ స్థాయిలో బీజేపీ హ‌వా, మోడీ వేవ్ ఎంత ఉన్నా తెలంగాణలో మాత్రం ఆ పార్టీని ప్రజలు ఆదరించే అవకాశం లేదని కాంగ్రెస్, టీ టీడీపీల‌కు చెందిన‌ ముఖ్యనేతలు భావిస్తున్నారు.

దీంతో అక్క‌డ టీ బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్లాప్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube