లగ్జరీ కారు కొన్న బిత్తిరి సత్తి.. ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇతని అసలు పేరు రవి కుమార్.

 Bittiri Satti Telugu News Channel Anchor Buy A New Range Rover Car, Bittiri Satt-TeluguStop.com

ఇతని పేరు వింటే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టేస్తారు.కాగా మొదట యాంకర్ గా తనకి తెలియని మొదలుపెట్టిన బిత్తిరి సత్తి తన కామెడీతో ఎంతోమందిని కడుగుబ్బ నవ్వించారు.

సామాన్యులను మాత్రమే కాకుండా సెలబ్రిటీలపై కూడా పంచులు వేస్తూ కడుపుబ్బా నవ్వించాడు బిత్తిరి సత్తి.ఇప్పటికే బుల్లితెరపై పలు షోలకు హాజరై మరింత పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.

నత్తి నత్తిగా మాట్లాడుతూనే తన కామెడీతో తన మాటలతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు.పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరినీ తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసుకుంటూ పోతున్నాడు బిత్తిరి సత్తి .అంతేకాకుండా బిత్తిరి సత్తి కామెడీ కి సంబంధించిన వీడియోలు ఎప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతూ ఉంటాయి.కాగా మొదట బిత్తిరి సత్తి తీన్మార్ న్యూస్ తో బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.

ఇలా ఉంటే ప్రస్తుతం బిత్తిరి సత్తికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే తాజాగా దసరా పండుగ సందర్భంగా బిత్తిరి సత్తి రేంజ్ రోవర్ కారు కొన్నాడు.భారత మార్కెట్లో ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ.89.41 లక్షలు (ఎక్స్-షోరూమ్).అన్ని పన్నులు మరియు ఇతర కస్టమైజేషన్లను ఏవైనా ఉంటే అన్ని కలిపి దీని ధర సుమారు కోటి రూపాయల వరకూ ఉంటుంది.

అంతే కాకుండా కారుకి ఆయుధ పూజను కూడా నిర్వహించాడు.అనంతరం ఆ కారుతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలను చూసిన బిత్తిరి సత్తి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.పలువురు అతని టాలెంట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇంకొందరు సామాన్య కుటుంబం నుంచి వచ్చి నేడు ఇంత పాపులారిటీ సంపాదించుకున్న బిత్తిరి సత్తి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube