అమ్మాయిలని అతిగా పొగిడితే ఇన్ని ప్రమాదాలు

పొగడ్తలంటే ఇష్టపడని అమ్మాయి ఉండదు.పొగడ్తకు పొంగిపోవడం అమ్మాయిల నైజం.

 Bitter Things Boys Should Face For Praising Her Too Much-TeluguStop.com

పొగడ్తలు అమ్మాయిల ముఖంలో చిరునవ్వు తెప్పిస్తాయి.అమ్మాయితో మాట్లాడడానికి, స్నేహం చేయడానికి పొగడడం అతి సులువైన దారి.

కాని పొగడ్తలు కూడా అతిగా ఉండకూడదు.రోజంతా అదే పనిగా పెట్టుకోకూడదు.

అతిగా పొగిడితే వచ్చే ప్రమాదాలు ఏంటో చూద్దాం.

* అతిగా పొగడటం వలన మిమ్మల్ని తక్కువగా చూడటం మొదలుపెడతారు కొంతమంది అమ్మాయిలు.

తమ పెత్తనం చెలాయించుకోవడం, తాము లేకపోతే అబ్బాయకిి మరో దిక్కు లేదనుకోవడం ఈ క్యాటగిరి అమ్మాయిలు చేసే పని.

* పొగడటం అనేది చాలా తెలివైన పని.ఏమాత్రం యాంత్రికంగా ఉన్నా, అమ్మాయిలు ఇంప్రెస్ అవరు.అలాంటి తెలివైన పనిని జీవితాంతం చేస్తూనే ఉండాలంటే కష్టం.

కొంతమంది అమ్మాయిలు ఊహలు పెంచేసుకుంటారు.ప్రతీరోజు అలాగే గడవాలి అనుకుంటారు.

పనుల ఒత్తిడి వలనో, ఇంకేదైనా ఇబ్బందుల వలనో, అబ్బాయిల ప్రవర్తన కాస్త మారినా తట్టుకోలేరు ఇలాంటి అమ్మాయిలు.

* ఇంకొందరు ఉంటారు, వారికి మామూలుగా పొగిడినా, పెద్దగా నచ్చదు.

ఇక అతిగా పొగిడితే, అబ్బాయి మీద నెగెటివ్ ఇంప్రెషన్ పెంచుకుంటారు.

కాబట్టి, అమ్మాయిని మనస్తత్వాన్ని బట్టి పొగడడం నేర్చుకోవాలి.

అలాగే ఎలాంటి అమ్మాయి అయినా, అతిగా పొగడకూడదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube