బిత్తిరి సత్తి కొత్త జాబ్‌ జాయిన్‌, సాలరీ ఎంతో తెలుసా?  

Bithiri Sathi Join In Sakshi Tv News Channel, Bithiri Sathi, V6, Teenmar News, tv9 Ismart News, Sakshi Tv, Big Boss, Chevella Ravi, - Telugu Big Boss, Bithiri Sathi, Chevella Ravi, Sakshi Tv, Teenmar News, Tv9 Ismart News, V6

తెలుగు బుల్లి తెర సెలబ్రెటీలకు ఈమద్య కాంలో స్టార్‌ హోదా దక్కుతోంది.బుల్లి తెరపై సందడి చేసే వారిని ప్రేక్షకులు సినిమా స్టార్స్‌ కంటే కూడా అధికంగా అభిమానిస్తున్నారు.

 Bithiri Sathi V6 Teenmar News Tv9 Ismart News

సీరియల్‌ నటీనటులు, యాంకర్స్‌ మాత్రమే కాకుండా తీన్మార్‌ ద్వారా పరిచయం అయిన బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవిపై జనాలు ఏ స్థాయిలో అభిమానంను కురిపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తీన్మార్‌ వార్తలు సూపర్‌ సెన్షేషనల్‌ సక్సెస్‌ అవ్వడంతో బిత్తిరి సత్తికి స్టార్‌ హోదా దక్కింది.

ఆ క్రేజ్‌తో సినిమాల్లో నటించడంతో పాటు పలు స్టేజ్‌ షోలు చేయడం చేతినిండా డబ్బు సంపాదించడం చేశాడు.

బిత్తిరి సత్తి కొత్త జాబ్‌ జాయిన్‌, సాలరీ ఎంతో తెలుసా-Movie-Telugu Tollywood Photo Image

వీ6 యాజమాన్యంతో విభేదాల కారణంగా బిత్తిరి సత్తి తీన్మార్‌ను వదిలేసి టీవీ9లో ప్రసారం అవుతున్న ఇస్మార్ట్‌ న్యూస్‌కు వచ్చేశాడు.అయితే టీవీ9తో కనీసం ఏడాది కూడా నడవకుండానే అప్పుడే సదరు ఛానెల్‌ను సత్తి వదిలేశాడు.మొదట బిగ్‌బాస్‌ ఆఫర్‌ రావడం వల్లే వదిలేశాడు అంటూ ప్రచారం జరిగింది.

కాని అసలు విషయం వివాదం అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.ఆ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

సత్తి తర్వాత జర్నీ ఎటు అంటూ చాలా మంది ఎదురు చూస్తున్న సమయంలో సాక్షి టీవీలో జాయిన్‌ అయ్యాడు.

సాక్షిలో అధికారికంగా జాయిన్‌ అవ్వడంతో పాటు అక్కడ టీమ్‌తో వెల్‌కమ్‌ పార్టీ కూడా తీసుకున్నాడు.సత్తితో పని చేసిన మరికొందరు కూడా సాక్షి టీవీలో జాయిన్‌ అయ్యారు.వీరంతా కలిసి వీ6 ‘తీన్మార్‌ వార్తలు’, టీవీ9 ‘ఇస్మార్ట్‌ న్యూస్‌’ వంటి న్యూస్‌ బులిటెన్‌ను ప్లాన్‌ చేస్తున్నారట.

అతి త్వరలోనే ఆ కొత్త కార్యక్రమం సాక్షిలో ప్రసారం కాబోతుంది.సాక్షి టీవీ వారు బిత్తిరి సత్తికి భారీ ఆఫర్‌ ఇచ్చారట.నెలకు దాదాపుగా రెండున్నర లక్షల సాలరీ సత్తికి అందబోతుంది.దాంతో పాటు ఇతర కార్యక్రమాలు చేసుకునేందుకు అనుమతి, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌లో ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అడ్డు చెప్పకూడదనేది ఒప్పందంగా తెలుస్తోంది.టీవీ9 వారు ఇచ్చిన సాలరీ కంటే ఇది ఎక్కువ అంటూ బుల్లి తెర వర్గాల వారి టాక్‌.

#Tv9 Ismart News #Bithiri Sathi #Sakshi Tv #Big Boss #V6

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bithiri Sathi V6 Teenmar News Tv9 Ismart News Related Telugu News,Photos/Pics,Images..