గల్లీ భాష మార్చుకొమ్మన్న నూతన్ నాయుడి కి గట్టి కౌంటర్ ఇచ్చిన బిత్తిరి సత్తి...నవ్విస్తూనే గట్టి చురక..  

బిగ్ బాస్ ప్రోగ్రామ్ లో హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన శ్యామల ,నూతన్ నాయుడు మళ్లీ ఎంట్రీ అయిన విషయం తెలిసిందే..మొదట్లో సామాన్యుడు గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు రీ ఎంట్రికి లక్షలు ఖర్చుపెట్టారు..తను సామాన్యుడేంటి అంటూ వార్తలు వచ్చిన విషయమూ విధితమే..అయితే ఇటీవల ఒక టాస్క్ లో రోల్ రైడా భాషపై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రేక్షకుల ఆగ్రహానికి గురయ్యారు నూతన్ నాయుడు..ఇదే విషయంపై స్పందించాడు బిత్తిరి సత్తి.

C Strong Counter To Nutan Naidu-

C Strong Counter To Nutan Naidu

బిత్తిరి సత్తి,సావిత్రి కలిసి వచ్చే తీన్మార్ ప్రోగ్రామ్ ఎంత సూపర్ హిట్టో మనందరికి తెలిసిందే.అందులో సావిత్రి,సత్తిల మధ్య సంభాషణలు రెండు రాష్ట్రాల ప్రేక్షకులను అలరిస్తాయి..భాషా తారతమ్యాలు లేకుండా దూసుకెళ్తున్న ఈ ప్రోగ్రామ్ లో భాష పట్ల నూతన్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించారు బిత్తిరి సత్తి,సావిత్రి.. మొదట్లో వ్యంగ్యంగా సాగినప్పటికి చివరికి వచ్చేసరికి గట్టి చురకే ఇచ్చారు..అయినా ఒక మనిషి భాషని కించపరచడానికి ఆయనెవరూ అందరం మాట్లాడేది తెలుగే కదా..అంటూ బిత్తిరి సత్తి చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆలోచన్లో పడేస్తున్నాయి..ఇంతకీ సత్తి ఏమన్నాడో మీరూ చూడండి..

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://youtu.be/T5D2SACMcZ0