రాజకీయాల్లోకి బిత్తిరి సత్తి.? ఏ పార్టీ తరపున ఎక్కడినుండి ఎం.ఎల్.ఏ గా పోటీచేయనున్నారు.?  

Bithiri Sathi Political Entry-

ఇన్నాళ్లు వి6 న్యూస్ చానల్‌లో తన కామెడి పంచ్‌లతో అందరికి నవ్వులు పంచిన బిత్తిరి సత్తి ఇప్పుడు రాజకీయాల్లో ప్రతిపక్షాలపై పంచులు వేయనున్నారా.? తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో టీఆర్ఎస్ పార్టీ తరుపున ఎన్నికల బరిలో దిగబోతున్నారని సమాచారం.

Bithiri Sathi Political Entry-

Bithiri Sathi Political Entry

టీఆర్ఎస్ కేవలం 14 స్థానల్లో తప్ప మిగిలిన 105 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించారు. ఇక మహాకూటమి పొత్తులు ఎత్తులతో సీట్ల సర్థుబాటులో ఇప్పటికి తలమునకలవుతుంది. అయితే టీఆర్ఎస్ మిగిల్చిన 14 సీట్లలో బీసీ కేటాయింపు స్థానం నుండి బిత్తిరి సత్తి (రవి కూమార్) పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరబాద్ మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి సత్తి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

Bithiri Sathi Political Entry-

అయితే మరికొందరు టీఆర్ఎస్ నుంచి కాదు కాంగ్రెస్ నుండి బిత్తిరి పోటి చేయబోతున్నాడని చెబుతున్నారు. అయితే ఏ పార్టీ నుండి ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తాడో కంటే సత్తి రాజకీయాల్లోకి రాబోతున్నాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.