టీవీ9తో బ్రేకప్‌ కారణం ఇదే.. తండ్రి ‘సాక్షి’గా బిత్తిరి సత్తి న్యూ జర్నీ షురూ

వీ6 లో ప్రసారం అయిన తీన్మార్‌ వార్తలతో సెన్షేషన్‌ క్రియేట్‌ చేసి ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్‌ను దక్కించుకున్న బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవి గురించి చర్చ మళ్లీ ప్రముఖంగా వినిపిస్తుంది.వీ6 నుండి తప్పుకున్న తర్వాత బిత్తిరి సత్తి టీవీ9 లో ఇస్మార్ట్‌ న్యూస్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇస్మార్ట్‌ న్యూస్‌ కు కూడా మంచి రేటింగ్‌ వచ్చింది.అనూహ్యంగా ఇస్మార్ట్‌ న్యూస్‌ నుండి బిత్తిరి సత్తి తప్పుకున్నాడు.దానికి కారణం బిగ్‌బాస్‌ షో అనుకున్నారు.బిగ్‌బాస్‌లో ఆఫర్‌ వచ్చిన కారణంగానే సత్తి ఇస్మార్ట్‌ న్యూస్‌కు గుడ్‌ బై చెప్పాడనే ప్రచారం జరిగింది.

 Bithiri Sathi Joins Sakshitv, Sakshi Tv, Bithiri Sathi, Tv9, Reason Behind Bithi-TeluguStop.com

కాని అసలు విషయాన్ని తాజాగా సత్తి క్లారిటీ ఇచ్చాడు. ఫాదర్స్‌ డే సందర్బంగా తన తండ్రికి సంబంధించిన స్కిట్‌ చేయడం వల్లే టీవీ 9 వారు నన్ను ఆ షో నుండి తప్పించారంటూ చెప్పకనే చెప్పాడు.

తాజాగా సాక్షిలో జాయిన్‌ అయిన బిత్తిరి సత్తి ఒక వీడియోను విడుదల చేశాడు.తండ్రి సాక్షిగా బిత్తిరి సత్తి టీవీ9 పై సున్నితంగా విమర్శలు చేశాడు.ఇదే సమయంలో తండ్రిని తల్చుకుంటూ సాగుతున్న సాక్షి టీవీలో చేయడం సంతోషంగా ఉందని కూడా సత్తి చెప్పాడు.

Telugu Bithiri Sathi, Bithirisathi, Sakshi Tv-

ఇకపై చూసుకోండి సత్తి సత్తా ఏంటో అంటూ ఛాలెంజ్‌ చేసినట్లుగా రవి ఛాలెంజ్‌ చేశాడు.సాక్షి టీవీలో బిత్తిరి సత్తి షో మరోసారి ట్రెండ్‌ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది. ఇస్మార్ట్‌ న్యూస్‌ ను డిజైన్‌ చేసిన ప్రోగ్రాం పొడ్యూసర్‌ ఈ షోను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ నెల చివరి నుండి సాక్షి టీవీలో బిత్తిరి సత్తి కొత్త న్యూస్‌ బులిటెన్‌ రాబోతుంది.అది తీన్మార్‌ ఇంకా ఇస్మార్ట్‌ న్యూస్‌ల మాదిరిగానే ఉంటుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube