Biswal Prabhas : తాను చనిపోయినా మరో ముగ్గురి ప్రాణాలను కాపాడిన బిస్వాల్ ప్రభాస్.. పేరెంట్స్ గ్రేట్ అంటూ?

ప్రస్తుత కాలంలో అవయవ దానం గురించి చాలామందికి అవగాహన ఉన్నా అవయవ దానం చేసే మంచి మనస్సు ఉన్నవాళ్లు మాత్రం చాలా తక్కువమంది ఉన్నారు.హైదరాబాద్ లోని కోకాపేటలో తాజాగా హిట్ అండ్ రన్ కేసు నమోదైంది.

 Biswal Prabhas Inspirational Success Story Details Here Goes Viral In Social Me-TeluguStop.com

వేగంగా వచ్చిన ఆటో ఒక బైక్ ను ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయింది.బైక్ పై ఉన్న విద్యార్థి బిస్వాల్ ప్రభాస్( Biswal Prabhas ) తీవ్రంగా గాయపడగా ఆ విద్యార్థికి బ్రెయిన్ డెడ్( Brain dead ) అయింది.

కొడుకు బ్రెయిడ్ డెడ్ వార్త విని తల్లీదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.బిస్వాల్ ప్రభాస్ లివర్, కిడ్నీలు( Liver, kidneys ) దానం చేసినట్టు అతని తల్లీదండ్రులు చెబుతున్నారు.

ప్రభాస్ దానం చేసిన అవయవాలతో ముగ్గురి ప్రాణాలను కాపాడారని సమాచారం అందుతోంది.జీవన్ దాన్ తెలంగాణ( Jeevan Dan Telangana ) ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించడం గమనార్హం.

బిస్వాల్ ప్రభాస్ కు సెల్యూట్ చేస్తూ ఆస్పత్రి సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు.

Telugu Biswal Prabhas, Brain, Jeevandan, Kidneys, Liver-Inspirational Storys

మరోవైపు పోలీసులు ఈ ఘటన గురించి కేసు నమోదు చేసుకుని వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు.కోకాపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వద్ద బిస్వాల్ ప్రభాస్ బైక్ పై వస్తున్న సమయంలో వేగంగా వచ్చిన ఆటో వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.బిస్వాల్ ప్రభాస్ తల్లీదండ్రులు ఎంతో బాధలో ఉండి కూడా అవయవదానానికి ముందుకు రావడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Biswal Prabhas, Brain, Jeevandan, Kidneys, Liver-Inspirational Storys

బిస్వాల్ ప్రభాస్ ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఫుడ్ డెలివరీ బాయ్ గా కూడా పని చేస్తున్నట్టు తెలుస్తోంది.వైద్యులు బిస్వాల్ ప్రభాస్ కుటుంబ సభ్యులకు అవయవ దానం గురించి వివరించడంతో వాళ్లు వెంటనే అవయవ దానానికి అంగీకరించారని తెలుస్తోంది.బిస్వాల్ భౌతికంగా మరణించినా ఎంతోమంది హృదయాల్లో మాత్రం ఉన్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.బిస్వాల్ ప్రభాస్ చదువులో కూడా చురుకుగా ఉండేవారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube