ఏపీ కొత్త గవర్నర్ నియామకం వెనుక ఉపరాష్ట్రపతి వెంకయ్య  

Biswa Bhusan Harichandan Is New Governor Of Andhra Pradesh-

ఏపీ గవర్నర్ గా ఇన్ని రోజులు బాద్యతలు నిర్వహిస్తున్న నరసింహన్ ని తప్పించి ఊహించని విధంగా బీజేపీ సీనియర్ నేత సంఘ్ పరివార్ తో అనుబంధం ఉన్న ఓడిస్సా నేతని గవర్నర్ గా బిస్వ భూషణ్ హరిచందన్ కేంద్ర ప్రభుత్వం నియమించింది.అయితే ఇప్పటి వరకు ఏపీలో కాని, కేంద్ర రాజకీయాలలో కాని ఆయన పేరు ఎప్పుడు ప్రముఖంగా వినిపించలేదు.అయితే మన పక్క రాష్ట్రం అయిన ఓడిస్సాలో గుర్తింపు పొందిన రాజకీయ నేత...

Biswa Bhusan Harichandan Is New Governor Of Andhra Pradesh--Biswa Bhusan Harichandan Is New Governor Of Andhra Pradesh-

ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేయడంతో పాటు ఒకసారి మంత్రిగా కూడా చేసారు.ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజకీయాలలోకి వచ్చిన అతను జీవితాంతం బీజేపీ పార్టీలోనే ఉన్నారు.సీనియర్ రాజకీయ నేతగా అతనికి బీజేపీలో సముచిత స్తానం లభించింది.

ఇదిలా ఉంటే బిస్వ భూషణ్ హరిచందన్ పేరును అసలు ఏపీ గవర్నర్ పోస్టుకు పరిశీలిస్తున్నట్లుగా కూడా సమాచారం లేదు.హఠాత్తుగా రాష్ట్రపతి ఏపీ నూతన గవర్నర్‌గా బిస్వ భూషణ్‌ హరిచందన్‌ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఇతను నియామకం వెనుక సీనియర్ బీజేపీ నేత, ప్రస్తుత ఉప రాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు హస్తం ఉందనే మాట రాజకీయ వర్గాలలో ఉంది.

Biswa Bhusan Harichandan Is New Governor Of Andhra Pradesh--Biswa Bhusan Harichandan Is New Governor Of Andhra Pradesh-

వెంకయ్యకి సన్నిహితుడుగా పేరున్న ఇతనిని కేంద్రానికి రిఫర్ చేసింది వెంకయ్యే అనే మాట బలంగా వినిపిస్తుంది.