ఆఫర్ల మీద ఆఫర్లు.. టీకా వేయించుకుంటే బిర్యానీ ఫ్రీ.. ఇంకెందుకు ఆలస్యం కుమ్మేయ్యండి.. !

ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ పట్ల ఉన్న అపోహలను తొలగించడానికి అధికారు ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో కోవిడ్ టీకా తీసుకున్న వారికి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

 Biryani Is Free If The Corona Vaccine Is Fried-TeluguStop.com

అదీగాక కరోనా టీకా వల్ల ఈ వైరస్ తీవ్రత కొంత వరకు తగ్గవచ్చని కూడా వెల్లడిస్తున్నారు.అంతే కాకుండా ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తుంది.

అయితే టీకా మీద అపోహలతో చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి జంకుతున్నారు.

 Biryani Is Free If The Corona Vaccine Is Fried-ఆఫర్ల మీద ఆఫర్లు.. టీకా వేయించుకుంటే బిర్యానీ ఫ్రీ.. ఇంకెందుకు ఆలస్యం కుమ్మేయ్యండి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో వారి అపోహలను పోగేట్టేందుకు ఏపీలో టీకా ఉత్సవం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ ఉత్సవంలో పలు రెస్టారెంట్లు సైతం పాల్గొని ప్రజలకు కరోనా టీకా పై అవగాహన కలిగిస్తున్నాయి.ఈ క్రమంలోనే టీకా ఉత్సవ్ లో పాల్గొని కోవిడ్ టీకా వేసుకుంటే బిర్యానీ ఫ్రీ అంటూ ఒక రెస్టారెంట్ భారీ ఆఫర్ ప్రకటించింది.

ఇలాగే కొన్ని రాష్ట్రాల్లో బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్న విషయం విదితమే.అయితే కాకినాడ, విజయనగరంలో ఉన్న హలో కిచెన్ అనే సంస్థ బ్రాంచ్ ల్లో వ్యాక్సిన్ తీసుకొని బిర్యానీ ఫ్రీ గా తినొచ్చు అని ఈ ఆఫర్ ఏప్రిల్ 11 నుండి 14 వరకు టీకా వేసుకున్నవారికి మాత్రమే తిన్నంత బిర్యానీ ఫ్రీ అంటూ ఆఫర్ ప్రకటించింది.

#Hello Kitchen #Vijayanagarm #Biryani Free #Corona Vaccine #Kakinada

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు