పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు  

Birthday wishes to Pan india super star Prabhas, Darling Prabhas, Prabhas Birthday, Radhe Shyam, Motion Poster Release, Darling birthday - Telugu Aadhi Purush, Birthday Wishes To Pan India Super Star Prabhas, Darling Birthday, Darling Prabhas, Motion Poster Release, Prabhas, Prabhas Birthday, Radhe Shyam, Radheshyam, Radheshyam Movie

సినిమా పరిజ్ఞానం కాస్త ఉన్న చిన్న పిల్లాడి నుండి పెద్ద వారి వరకు ఎవరినైనా పాన్ ఇండియా స్టార్‌ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు ప్రభాస్‌.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ ఆకాశమే హద్దుగా మారిపోయింది.

TeluguStop.com - Birthday Wishes To Pan India Super Star Prabhas

బాలీవుడ్‌ ప్రేక్షకులు ప్రభాస్ ను ఏ స్థాయిలో అభిమానిస్తారు అనేది సాహో ఫలితాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.అద్బుతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కలిగి ఉన్న ప్రభాస్‌ ప్రస్తుతం మూడు సినిమాలను చేస్తున్నాడు.

వాటి విలువ వెయ్యి కోట్లకు పైగానే అనే విషయం అందరికి తెల్సిందే.ఇండియాలో ఇప్పటి వరకు ఏ హీరోకు దక్కని ఇంతటి అరుదైన అద్బుతమైన గౌరవం కేవలం ప్రభాస్‌కు మాత్రమే దక్కింది.

TeluguStop.com - పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రస్తతుం చేస్తున్న రాధేశ్యామ్‌ వచ్చే ఏడాది సమ్మర్‌ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఆది పురుష్‌ మరియు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలను 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రికార్డు స్థాయి వసూళ్లను ఈమూడు సినిమాలు దక్కించుకుంటే ప్రభాస్‌ క్రేజ్‌ మరింత పెరగడం ఖాయం అంటున్నారు.ఈ సినిమాలతో ప్రభాస్‌ పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ అనే పేరుకు మించి స్టార్‌ డంను దక్కించుకుంటాడు అనే టాక్‌ వినిపిస్తుంది.

ఈ విషయంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి మిర్చి సినిమా వరకు ఒక సింపుల్‌ స్టార్‌గానే కొనసాగాడు.ఎప్పుడైతే బాహుబలి చేశాడో అప్పటి నుండి అతడి స్టార్‌ డం పెరిగింది.అద్బుతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అతడి సొంతం అయ్యింది.

అందుకే అతడికి ఈ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.నేడు ప్రభాస్‌ పుట్టిన రోజు.

ఈ సందర్బంగా ఆయన నటించిన రాధేశ్యామ్‌ మోషన్‌ పోస్టర్‌ రాబోతుంది.దాంతో పాటు ఆది పురుష్‌ కు సంబంధించిన ఏమైన కీలక అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

ఇదే సమయంలో నాగ్‌ అశ్విన్‌ నుండి ప్రభాస్‌కు ఎలాంటి పుట్టిన రోజు కానుక వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.మా తరపున కూడా ప్రభాస్‌కు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

#Prabhas #Radhe Shyam #Darling Prabhas #Radheshyam #Aadhi Purush

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Birthday Wishes To Pan India Super Star Prabhas Related Telugu News,Photos/Pics,Images..