బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తోన్న మాస్ రాజా!  

Birthday Gift Ready For Raviteja Fans, Raviteja, Krack, Khiladi, Tollywood News - Telugu Khiladi, Krack, Raviteja, Tollywood News

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రావడంతో మాస్ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు.

TeluguStop.com - Birthday Gift Ready For Raviteja Fans

ఇక ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన తీరు ఆయన అభిమానులకు పండుగ ట్రీట్‌ను అందించింది.కాగా ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రవితేజ తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటికే తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ పక్కా కమర్షియల్ మూవీకి ‘ఖిలాడి’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

TeluguStop.com - బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తోన్న మాస్ రాజా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.రవితేజ పుట్టినరోజు అయిన జనవరి 26న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమా షూటింగ్‌లో రవితేజ పాల్గొంటుండటంతో ఈ సినిమాను అతి త్వరలో పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.

మాస్ రాజా డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో ఆయన ఎలాంటి పాత్రల్లో నటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరితో పాటు డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఈ సినిమా టీజర్‌ను జనవరి 26న రిలీజ్ చేస్తారా లేరా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి రవితేజ వరుసగా సెల్ఫీ ఫోటోలు పెడుతుండటంతో అవి బాగా వైరల్ అవుతున్నాయి.

#Raviteja #Krack #Khiladi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు