వైరల్: నాలుగు కాళ్ళు, నాలుగు చేతులతో నవజాత శిశువు జననం..!

మాతృత్వం అనేది దేవుడి ఆడదానికి ఇచ్చిన గొప్ప వరం అనే చెప్పాలి.తల్లి కావాలని బిడ్డతో అమ్మా అని పిలిపించుకోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది.

 Birth Of A Newborn Baby With Four Legs And Four Arms , 4 Hands, 4 Leg, Baby Bi-TeluguStop.com

గర్భంలో శిశువు పెరుగుతుంది అని తెలిసినప్పటి నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుంది ఆ తల్లి. ప్రతి నెల హాస్పిటల్ కి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని, డాక్టర్ ఇచ్చిన సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటుంది.

ఒక తల్లి కూడా సరిగ్గా అలాగే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని, అవయవ లోపం లేకుండా ఆరోగ్యంగా జన్మించాలని ప్రతి నెల క్రమం తప్పకుండా వైద్యం చేపించుకుంటూ వచ్చింది. డాక్టర్లు కూడా పరీక్షలు చేసి ఆమె కడుపులోని బిడ్డా, తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చెబుతూ వచ్చారు.

ఎన్నో ఆశలతో బిడ్డ కోసం ఎదురుచూసిన ఆ తల్లికి పుట్టిన బిడ్డను చూసి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది.నార్మల్ డెలివెరీ సాధ్యం కాకపోవడంతో సిజేరియన్ చేసి శిశువును బయటికి తీశారు.

పుట్టిన ఆ బిడ్డను చూసి డాక్టర్లు, బిడ్డ కుటుంబ సభ్యులు అందరు కూడా షాక్ తిన్నారు.ఎందుకంటే ఆ బిడ్డకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉన్నాయి కాబట్టి.

పుట్టిన వింత శిశువును చూసి కుటింబీకులు ఇలా ఎందుకు జరిగిందని డాక్టర్లతో గొడవకు దిగారు అసలు వివరాల్లోకి వెళితే.బీహార్ రాష్ట్రం కతిహార్ జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చే హఫ్లగంజ్ గ్రామానికి చెందిన రాజు,సాహ్ దంపతులకు ఇలా వింత శిశువు జన్మించింది.

రాజు భార్య గర్భందాల్చినప్పటి నుంచి కతిహార్ పట్టణంలోని సదార్ ఆస్పత్రిలో ప్రతినెల చెకప్ చేయించుకునేది.కానీ ఇలా వింత శిశువు జన్మించడం పట్ల ప్రైవేటు క్లినిక్​ వైద్యులపై రాజు బంధువులు ఆరోపణలు చేశారు.

తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు స్కానింగ్​ లు కూడా తీసారని అప్పుడు దీని గురించి ఎలాంటి విషయాలు చెప్పలేదని పైగా శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పేవారని డాక్టర్లపై ఆవేదన వ్యక్తం చేశారు.

రాజు కూడా పెద్దగా చదువుకోలేదు.

ఇలా అతనికి నాలుగు కాళ్లు, నాలుగు చేతుల శిశువు జన్మించడంతో భగవంతుడి అవతరంగా భావించి గ్రామస్థులంతా ఆ బిడ్డను చూడడానికి ఆస్పత్రికి వచ్చి పోతున్నారు.కానీ.

, రాజు కుటుంబీకులు ఈ విషయంను పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.ఈ విషయం పట్ల డాక్టర్లు మరోసారి అందరికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

రాజు భార్యకు పుట్టింది వింత శిశువు కాదని, ఆ శిశువును దివ్యాంగులుగా పిలుస్తారని సదరు ఆస్పత్రి వైద్య సిబ్బంది చెప్పారు.నిజానికి కవల పిల్లలు పుట్టాలిసి ఉండగా, రెండు పిండాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్లే ఇలా ఒకే శిశుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు వచ్చాయని డాక్టర్లు చెప్పారు.

అయితే ప్రస్తుతానికి పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నప్పటికి రాబోయే రోజుల్లో ఆ శిశువుకు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు అనుమానాలు వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube