పక్షులు కరెంటు తీగ పై కూర్చుంటే షాక్ కొట్టదా..?!

మనలో చాలా మందికి ఎన్నోసార్లు కరెంటు వైర్ల పై కూర్చున్న పక్షులను చూస్తూనే ఉంటాం.అయితే మనలో చాలా మందికి అలా పక్షులు కూర్చుంటే ఆ పక్షికి షాక్ కొట్టదా అనిపిస్తుంటుంది.

 Birds, Current Wires, Shock, Phase, Death, Danger-TeluguStop.com

అయితే దానికి ఏలాంటి షాక్ కొట్టదు.కేవలం ఒక వైరు మీద నిలబడి ఉన్న పక్షికి ఎటువంటి హాని జరగదు.

అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు.అందులో మొదటిది.

సాధారణంగా మన ఇంటికి సప్లై చేసే కరెంట్ స్తంభాలకు మొత్తం 4 రకాల తీగలు లాగబడి ఉంటాయి.ఇందులో మొత్తం మూడు తీగలు ఫేజ్ తీగలుగా, ఒకదాన్ని న్యూట్రల్ అని పిలుస్తారు.

ఇకపోతే అందరికీ తెలిసిన విధంగానే ఒక ఫేజ్ తీగకు మరో ఫేజ్ తీగకు మధ్య ఒక న్యూట్రల్ తీగకు మధ్య విద్యుత్ పొటెన్షియల్ ఉంటుంది.

ఏ వస్తువుకైనా సరే, ఏ పదార్థానికి అయినా సరే, మనిషి కైనా, ఏ జీవికైనా సరే విద్యుత్ వాటి నుండి ప్రవహించాలంటే అటు ఇటు విద్యుత్ పొటెన్షియల్ తేడా కచ్చితంగా ఉండాలి.

దీన్ని బట్టి చూస్తే ఒక వ్యక్తికి షాక్ తగలా లంటే ఏక కాలంలో కనీసం రెండు తీగలను అనుసంధించి ఉంటేనే షాక్ కొడుతుంది.

ఇలా ఒక్క తీగను మనిషి కూడా పట్టుకొని నిలబడితే ఎలాంటి ప్రమాదం జరగదు.

కాకపోతే ఆ సమయంలో ఆ మనిషికి చెప్పుల్లేకుండా తాకాడు అంటే అతని నుండి కచ్చితంగా కరెంట్ పాస్ అవుతుంది.లేకపోతే ఒక ఫేజ్ తీగ అలాగే ఒక న్యూట్రల్ కలిసి పట్టుకుంటే గాలిలో ఉండగానే షాక్ తగులుతుంది.

ఇక ఈ విషయం సంబంధించి పక్షుల పరంగా చూస్తే ఏ పక్షి కూడా ఒకే సమయంలో రెండు తీగలపై వాలదు.కాబట్టి వాటి శరీరం నుండి ఎలాంటి విద్యుత్ ప్రసరణ జరగదు.

ఒకవేళ పొరపాటున ఆ పక్షి యొక్క కాళ్లు ఒక తీగ పై ఉంచి తన శరీరంలోని ఏ భాగం అయిన సరే మరో తీగకు తగిలితే అప్పుడు ఖచ్చితంగా షాక్ కు గురై చనిపోవడం జరుగుతుంది.అయితే ఇలాంటి సంఘటనలు చాలా అరుదే.

కేవలం ఒక్క వైరు పట్టుకుంటే ఎలాంటి ప్రమాదం జరగదని భావించి ప్రయోగాలు చేస్తే ఏదైనా జరగరానిది జరిగిందంటే ప్రాణాలు మీదికి వస్తుంది.కాబట్టి ఎవరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయకండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube