రోజు ఆహారం పెట్టే వ్యక్తిని చంపేసిన పక్షి.. ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు  

Bird Killed A Person Who Feeds Daily-bird,daily,feed,field,food,general Telugu Updates,killed,owner,person,shock

కుక్కలను పెంచుకుంటే అవి విశ్వాసంతో ఉంటాయి, వాటికి ఒక్క రోజు బోజనం పెడితే అవి జీవితాంతం విశ్వాసంగా ఉంటాయి. ఇతర జంతువులన్నింటితో పోల్చితే కుక్కలకు అత్యంత ఎక్కువ విశ్వాసం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మనుషుల కంటే ఎక్కువగా కుక్కలు విశ్వాసంతో ఉంటాయి..

రోజు ఆహారం పెట్టే వ్యక్తిని చంపేసిన పక్షి.. ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు-Bird Killed A Person Who Feeds Daily

అందుకే కుక్కలను మనుషులు పెంచుకుంటూ ఉంటారు. కుక్కల్ని కాకుండా మరే పక్షులను అయినా, జంతువులను అయినా పెంచుకుంటే అవి ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో వాటి రాక్షస బుద్దిని చూపిస్తాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆస్ట్రేలియాలో జరిగింది.

ఆస్ట్రేలియాకు చెందిన ఒక రైతు కాస్సోవారీ అనే భారీగా ఉండే పక్షిని పెంచుతున్నాడు. ప్రతి రోజు ఆ పక్షికి ఆహారం పెట్టడంతో పాటు, దానికి ఇతర సంరక్షణను చూస్తూ ఉంటాడు. కాస్సోవారీ పక్షి ఆరు అడుగుల ఎత్తు ఉండటంతో పాటు, అత్యంత బలమైన కాళ్లను కలిగి ఉంటుంది.

ఈ జాతి పక్షులు ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని మాసం కోసం పెంచుతారు. ఈమూ జాతి కోళ్ల మాదిరిగా కనిపించే ఈ పక్షులు చాలా కోపంగా ఉంటాయని, ఉన్నంత సమయం మంచిగా ఉన్నా ఆ తర్వాత కోపంతో రెచ్చి పోతాయి.

తాజాగా ఈ పక్షి తన యజమానిని చంపేసి చర్చనీయాంశం అయ్యింది.

తాజాగా యజమాని పొలంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో అతడు జారి కింద పడి పోయాడు. అప్పుడు పక్కనే ఉన్న ఈ పక్షి పరిగెత్తుకుంటూ వెళ్లి యజమాని పొట్ట మరియు చాతిపై తన బలమైన, పదునైనా కాళ్లతో గుచి గుచ్చి చంపేసింది.

అతగాడు నిల్చున్న సమయంలో ఏం చేయని ఆ పక్షి పడిపోయిన సమయంలో ఎందుకు ఇలా చేసిందని చాలా ఎంక్వౌరీ చేశారు. పోలీసులు ఈ కేసు విచారణ సమయంలో ఆసక్తికర విషయాన్ని తెలుసుకున్నారు. కొన్ని కారణాల వల్ల యజమాని రెండు రోజులుగా పక్షికి ఆహారం పెట్టడం లేదట..

ఆ కారణం వల్ల పక్షి చంపేసి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.