కరోనాకు తాతలాంటి వైరస్.. రెడీగా ఉండాలట!  

Bird Flu To Be Most Dangerous Than Corona Virus - Telugu American Doctor, Bird Flu, Corona Virus, Viral News

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలందరూ వణికిపోతున్నారు.తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఇళ్లకే పరిమితం అయ్యారు.

 Bird Flu To Be Most Dangerous Than Corona Virus

దాదాపు రెండు నెలలకు పైగా పలు దేశాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.అయినా కూడా కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

లక్షల సంఖ్యలో మనుష్యుల ప్రాణాలను హరించిన ఈ మహమ్మారికి మందు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కరోనాకు తాతలాంటి వైరస్.. రెడీగా ఉండాలట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే కరోనా వైరస్‌కే మనుష్యులు కొట్టుమిట్టాడుతుంటే, దీన్ని తలదన్నే వైరస్ మరొకటి రాబోతుందంటే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంగా ఉంటుంది.

కానీ ఇదే మున్ముందు జరగబోతున్నట్లు అమెరికాకు చెందని ఓ వైద్యుడు హెచ్చరిస్తున్నాడు.శాఖాహారాన్ని ప్రోత్సహించే గ్రూపుకు చెందిన డాక్టర్ మైఖేల్ గ్రెగర్ కరోనా వైరస్‌కు తాతలాంటి వైరస్ రాబోతుందని, ఆ వైరస్ ధాటికి భూగోళంపై సగం జనాభా మట్టిలో కలిసిపోనున్నారని జోస్యం చెబుతున్నారు.

బర్డ్ ఫ్లూ అనే వైరస్ పక్షుల ద్వారా మనుష్యులకు సంభవిస్తుందని, దాని కారణంగా కోట్ల సంఖ్యలో ప్రాణనష్టం జరగబోతుందని ఆయన అంటున్నాడు.

అంటువ్యాధులను ఎలా నివారించాలి అనే అంశంపై ఆయన ఓ పుస్తకం రాశారు.

ప్రస్తుతం ప్రపంచంలో 2400 కోట్ల కోళ్లను పెంచుతున్నారని ఆయన తెలిపాడు.కోళ్ల పెంపకం, వాటిని తినడం లాంటి కారణంగా మున్ముందు బర్డ్‌ఫ్లూ అనే భయంకరమైన వైరస్ మనుష్యుల్లోకి ప్రవేశిస్తుందని ఆయన తెలిపారు.

ఈ వైరస్ చాలా వేగంగా అభివృద్ధి చెందడంతో మానవులు దీనిని తట్టుకునే శక్తిని కోల్పోయి ప్రాణాలు పోగొట్టుకుంటారని అన్నారు.కోళ్లకు కెమికల్స్‌తో కూడిన ఆహారం పెట్టడంతో ఈ వైరస్ వస్తుందని ఆయన తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్నవారు భయంతో వణికిపోతున్నారు.అసలే కరోనా వైరస్ దెబ్బకు భయంతో బతుకుతున్నామని, ఇక బర్డ్‌ఫ్లూ లాంటి వైరస్ సోకితే అంతే సంగతులు అంటూ వారు భయబ్రాంతులకు లోనవుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bird Flu To Be Most Dangerous Than Corona Virus Related Telugu News,Photos/Pics,Images..

footer-test