టీమిండియా మాజీ కెప్టెన్ ధోని కి బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్..!!

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి కూడా బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ తగిలింది.మేటర్ లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ గట్టిగానే ఉన్న సంగతి తెలిసిందే.

ఆ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ రోజు రోజుకి అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో.కోళ్ళు లక్షల సంఖ్యలో మృతి చెందుతున్నాయి.

ఈ నేపథ్యంలో కడక్‌నాథ్ కోళ్లకు పెట్టింది పేరు అయినా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఝబువా జిల్లాలో కూడా బర్డ్‌ఫ్లూ పాకడంతో ఆ ప్రాంతంలో కోళ్లు చాలా వరకు మృత్యువాత పడ్డాయి.ఆ జిల్లాలో కోళ్లకు హెచ్‌5ఎన్‌1 వైరస్ సోకటం తో దాని చుట్టు ప్రక్కల కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఇన్ఫెక్టెడ్ జోన్‌గా ఆ జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

Telugu Bird Flu, Dhoni, Jhabhuvaa, Madhya Pradesh-Latest News - Telugu

ఈ క్రమంలో జిల్లా నుండి వైరస్ ఇతర ప్రాంతాల్లో కి విస్తరించకుండా జిల్లాలో ఉన్న పక్షులను చంపాలని కూడా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది.దీంతో అదే జిల్లాలో ధోని కోళ్ల ఫామ్ కోసం పెంచిన  2500 కడక్‌నాథ్ కోళ్ళకి బర్డ్‌ఫ్లూ రావడంతో మృత్యువాత పడ్డాయి.ఈ విషయాన్ని ధోని కోళ్ల ఫారం ఓనర్ వినోద్ మేదా వెల్లడించారు.గత నెలలో ఆర్డర్ ఇవ్వటం జరిగిందని వాతావరణం సరిగా లేక డెలివరీ చేయలేకపోయిన్నట్లు, ఇంతలోనే బర్డ్‌ఫ్లూ రావటం ఆర్డర్ చేసిన 2500 కడక్‌నాథ్ కోళ్లు మరణించడం జరిగింది అని చెప్పుకొచ్చాడు.

నల్ల రంగులో ఉండే ఈ కడక్‌నాథ్ కోళ్లు చికెన్ ధర మిగతా వాటి కంటే ఎక్కువ.రిటైర్డ్ అయిన తర్వాత వ్యాపార రంగంలో అడుగుపెట్టిన ధోని.కోళ్ల ఫారం లో కూడా రాణించాలని చూసినా ఈ తరుణంలో ఈ విధంగా జరగటంతో ధోని ఫాన్స్ సోషల్ మీడియాలో ఈ విషయం తెలుసుకుని బ్యాడ్ లక్ అంటున్నారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube