సిగరెట్ పీకను నోటికి అందిస్తున్న తల్లి పక్షి

పర్యావరణాన్ని కాపాడాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి లో ఉంది.ఈ పర్యావరణం కారణంగా నోరు లేని మూగజీవాలు హానికి గురవుతున్నాయి.

 Bird Feeding Cigaretteto Babybird 1-TeluguStop.com

ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా ఈ పర్యావరణం గురించి ప్రజలలో మాత్రం చైతన్యం కలగడం లేదు.అలాంటి ఒక ఉదంతానికి సంబందించిన ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న సెయింట్ పీట్స్ బీచ్‌లో కరెన్ మేసన్ అనే ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.బీచ్ ఒడ్డున ఓ తల్లి పక్షి పిల్ల పక్షి నోటికి సిగరెట్ పీకను అందిస్తున్న ఫోటో అది.అయితే ఆ సిగరెట్ పీక తినే పదార్థం అనుకున్న ఆ నోరు లేని మూగజీవి దానిని తీసుకెళ్లి తన పిల్ల పక్షికి అందించింది.ఇది చూసి చలించిన ఆ ఫోటోగ్రాఫర్ వెంటనే ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించడమే కాకుండా సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.

సిగరెట్ పీకను నోటికి అందిస్త�

అంతే ఇక ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది.పొగ తాగే అలవాటు ఉన్నవారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పెద్ద ఎత్తున నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.అంతేకాకుండా బీచ్ ఒడ్డున స్మోక్ చేయడం లో తప్పులేదు కానీ,వాటిని స్మోక్ చేసిన అనంతరం ఇలా అక్కడే వదిలేయకుండా,వేరేచోట పడేస్తే మంచిదని మరికొందరు సలహా ఇస్తున్నారు.మరి ఈ ఫోటో చూసి అయినా జనాల్లో మార్పులు వస్తాయేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube