బిపిన్ రావత్ మరణం పట్ల రియాక్ట్ అయిన మోడీ..!!

Bipin Rawat Death Modi Reaction

భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ మరణం పట్ల సోషల్ మీడియాలో ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 Bipin Rawat Death Modi Reaction-TeluguStop.com

ఆయనతో పాటు ఆయన భార్య మరియు సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం తనకి తీవ్ర వేదనకు గురి చేసిందని తెలిపారు.వారంతా దేశం కోసం అంకితభావంతో సేవలందించారని ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు సానుభూతి సంతాపం తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు.

బిపిన్ రావత్ నిజమైన సైనికుడు.దేశ భక్తుడు అని కొనియాడారు.భారత సాయుధ బలగాలను.ఆధునిక రించడంలో ఎంతో కృషి చేశారని, విశిష్ట సేవలందించారని స్పష్టం చేశారు.

 Bipin Rawat Death Modi Reaction-బిపిన్ రావత్ మరణం పట్ల రియాక్ట్ అయిన మోడీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కీలక సమయాలలో ఆయన ఆలోచనలు మరియు దృక్కోణాలు ఎంతో దేశానికి ఉపయోగకరంగా ఉండేవని తెలిపారు.అటువంటి వ్యక్తి ప్రాణాలతో లేరంటే చాలా బాధగా ఉందని స్పష్టం చేశారు.

భారత మొట్టమొదటి సిడిఎస్ గా ఆయన అనుభవంతో అందించిన సేవలు దేశం ఎప్పుడు మర్చిపోదని  స్పష్టం చేశారు.ఇదే సమయంలో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బిపిన్ రావత్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

#Prime Modi #Bipin Rawat #Bipin Rawat #Cds Bipin Rawat #Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube