హీరోయిన్ ఛాన్సులు లేక చివరకు అలా మారిన రకుల్  

Rakul To Play Prostitute In Biopic Movie, Rakul Preet Singh, Prostitute, Biopic, Tollywood News - Telugu Biopic, Prostitute, Rakul Preet Singh, Tollywood News

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అతి తక్కువ సమయంలో అందుకున్న సంగతి తెలిసిందే.ఈ బ్యూటీ దాదాపు అందరూ యంగ్ హీరోలతో నటించి మెప్పించింది.

 Biopic Rakul Preet Singh

ఇక వరుస ఫెయిల్యూర్స్ కారణంగా ప్రస్తుతం ఆమె ఫేడవుట్ అయిపోయింది.అడపాదడపా సినిమాలు చేస్తున్నా, అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం సక్సెస్ కావడం లేదు.

దీంతో ఆమెకు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది.

హీరోయిన్ ఛాన్సులు లేక చివరకు అలా మారిన రకుల్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే రకుల్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఇండియన్-2 చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమాలో యంగ్ హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తుండగా, ఆయనకు జోడీగా రకుల్ చేస్తోంది.ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, బాలీవుడ్‌లో ఓ బోల్డ్ బయోపిక్ పాత్రలో నటించేందుకు రకుల్ రెడీ అయ్యింది.

ముంబై రెడ్‌లైట్ ఏరియాకు చెందిన ఓ వేశ్య కథను బయోపిక్‌గా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతుండగా, ఈ పాత్రలో నటించేందుకు రకుల్‌ను సంప్రదించారట సదరు చిత్ర యూనిట్.

దీంతో రకుల్ కూడా వెంటనే ఈ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పిందట.

ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయని, ఇలాంటి పాత్రలు తమ కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతాయని సంతోషంతో గెంతులేస్తోంది ఈ బ్యూటీ.వేశ్య పాత్రలో నటిస్తే వెండితెరకు చుక్కలు చూపించొచ్చని రకుల్ భావిస్తోంది.

మరి ఈ సినిమాలోని వేశ్య పాత్రలో రకుల్ ఎలా రెచ్చిపోతుంది, ఆమెకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Biopic #Prostitute

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Biopic Rakul Preet Singh Related Telugu News,Photos/Pics,Images..