ఓ అసాధారణ మహిళ బయోపిక్ తెరపైకి

సమాజంలో మెజారిటీ ప్రజలు తమ జీవితకాలంలో ఎక్కువ సమయం తమ కోసం, తమ కుటుంబం కోసం ఉపయోగిస్తారు.సమాజంలో గొప్పగా ఎదగడానికి కొందరు సమయం కేటాయిస్తే.

 Biopic Of Uma Preman To Be Directed By Vigneswaran Vijayan, Tollywood, Kollywood-TeluguStop.com

కొందరు తమ జీవితాన్ని ఏదో ఉన్నంతలో సాఫీగా సాగించేస్తూ ఉంటారు.అయితే సమాజంలో మనుషుల రూపాలు అందరివీ ఒకేలా లేనట్లు జీవితాలు కూడా ఒకే విధంగా లేవు.

కొందరు ధనవంతులుగా ఉంటే మరికొందరు మధ్యతరగతి జీవితాలని గడుపుతున్నారు.మరికొందరు పేదరికంలో జీవితాలను ఈడుస్తున్నారు.

మూడు పూటల తినడానికి కూడా కష్టంగా జీవితాలని నెట్టుకొస్తున్నారు.ఇలాంటి పేద కుటుంబాలలో కష్టం వచ్చిన దానిని ధైర్యంగా ఎదుర్కోలేరు.

ఏదైనా రోగం వచ్చిన హాస్పిటల్స్ చుట్టూ తిరగలేరు.ఇలాంటి వారు ఇండియాలో కోట్ల మంది ఉంటారు.

అయితే కొంత మంది ఇలాంటి వారికి అండగా ఉండటంలో, సమాజ సేవలో భాగమై సంతృప్తికర జీవితాలని కొనసాగిస్తారు.ఎదుటివారికి సాయం చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు.

Telugu Biopic Trend, Kollywood, Pan India, Tollywood-Latest News - Telugu

అలాంటి సమాజ సేవకులని ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది.అలా సమాజసేవలో భాగమైన సాధారణ మహిళగా ఉంటూ అసాధారణమైన పనులు చేస్తున్న ఇండియన్ విమెన్ రియల్ హీరో అనిపించుకున్న ఉమా ప్రేమన్ జీవిత కథని ఇప్పుడు తెరపైకి ఎక్కిస్తున్నారు.ఈ మధ్యకాలంలో బయోపిక్ ట్రెండ్ సినిమా ఇండస్ట్రీలో నడుస్తుంది.సమాజంలో వివిధ రంగాలలో గొప్పవాళ్ళు అయినవారి జీవిత కథలని తెరపై ఆవిష్కరించి హిట్స్ కొడుతున్నారు.ఇప్పుడు అదే కోవలో ఉమా ప్రేమన్ బయోపిక్ కి కూడా రంగం సిద్ధమైంది.సాధార‌ణ మిల్లు కార్మికుని ఇంట్లో పుట్టి, ల‌క్ష‌లాది మంది ప్రాణాల‌ను కాపాడిన ఉమా ప్రేమ‌న్ జీవితం తెరిచిన పుస్తకం.

దాదాపు 2 ల‌క్ష‌ల డ‌యాల‌సిస్‌లు, 20 వేల‌కు మించిన గుండె శ‌స్త్ర చికిత్స‌లు, వంద‌లాడి కిడ్నీ మార్పిడులు, గిరిజ‌నుల కోసం పాఠ‌శాల‌లు, త‌క్కువ ఖ‌ర్చుతో ఇళ్లు వంటివి ఉమా ప్రేమ‌న్ చేసిన సేవ‌ల్లోఉన్నాయి.దేశంలోనే ఆమె మొట్ట‌మొద‌టి ప‌రోప‌కార మూత్ర‌పిండ దాత‌.

రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా రియ‌ల్ హీరో అవార్డుని సైతం ఉమా ప్రేమన్ అందుకుంది.అటువంటి అసాధార‌ణ మ‌హిళ జీవితం త్వ‌ర‌లో బ‌హు భాషా బ‌యోపిక్‌గా రూపొంద‌నున్న‌ది.

ట్రాఫిక్ రామ‌సామి ఫేమ్ విఘ్నేశ్వ‌ర‌న్ విజ‌య‌న్ ఈ బ‌యోపిక్‌ను డైరెక్ట్ చేయ‌నున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube