తెలుగులోనే కాదు.. ఓవర్సీస్ లో కూడా బింబిసార విధ్వంసం..ఎంత రాబట్టిందంటే?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ ఫిక్షనల్ సినిమా బింబిసార.యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.

 Bimbisara Usa Box Office Collections, Kalyan Ram , Bimbisara , Samyukta Menon,ca-TeluguStop.com

ఇందులో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్త మీనన్, క్యాథరిన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 5న థియేటర్స్ లోకి వచ్చింది.

ఎప్పటి నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో కళ్యాణ్ ఒకరు.ఈయన ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో అనిపించు కోలేక పోయారు.

కెరీర్ లో ఇప్పటి వరకు రెండు హిట్లు మాత్రమే అందుకున్నాడు.అందుకే బ్లాక్ బస్టర్ హిట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.

ఏడాదిన్నర తర్వాత బింబిసార సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Telugu Bimbisara, Bimbisarabox, Catherine Tresa, Kalyan Ram, Samyukta Menon, Usa

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా 5వ శతాబ్దానికి చెందిన బింబిసారుడు కథాంశంతో ఆసక్తికరంగా నూతన డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ గా ఫ్యాన్స్ డిసైడ్ చేసారు.చాలా ఏళ్ల తర్వాత కళ్యాణ్ రామ్ హిట్ అందుకోవడమే కాకుండా సూపర్ హిట్ అని టాక్ రావడంతో సంతోషంగా ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది.ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది.

తాజాగా ఈ సినిమా 2 లక్షల 50 వేల డాలర్స్ క్రాస్ చేసి మరింత స్ట్రాంగ్ గా నిలబడుతుంది.ఈ సినిమా ఇంత హిట్ అవ్వడంతో మరిన్ని స్క్రీన్స్ ని కూడా ఏర్పాటు చేశారు.

దీంతో వీకెండ్ ముగిసే సరికి మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube