బింబిసార తెలుగు రాష్ట్రాల హక్కులు అన్ని కోట్లా.. దిల్ రాజు లక్కీ అంటూ?

కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బింబిసార సినిమా ఆగష్టు నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు తీసుకున్నారని సమాచారం అందుతోంది.9 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.9 కోట్ల రూపాయలకు బింబిసార హక్కులు అంటే ఈ మొత్తం తక్కువ మొత్తమే అని చెప్పాలి.

 Bimbisara Movie Telugu States Rights Details, Bimbisara, Bimbisara Telugu Rights-TeluguStop.com

అయితే కళ్యాణ్ రామ్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో తక్కువ మొత్తానికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని చెప్పాలి.

రిఫండబుల్ క్లాజ్ కు నిర్మాత కళ్యాణ్ రామ్ అంగీకరించడంతో దిల్ రాజు 9 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారని సమాచారం అందుతోంది.సంయుక్త మీనన్, కేథరిన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించడం గమనార్హం.

దిల్ రాజు లక్కీ కాబట్టే తక్కువ మొత్తానికి ఈ సినిమా హక్కులు దక్కాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Bimbisara, Catherine, Kalyan Ram, Dil Raju, Ram Pothineni, Samyukra Menon

రామ్ హీరోగా తెరకెక్కిన ది వారియర్ సినిమాను నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం గమనార్హం.ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాల్సి ఉందనే సంగతి తెలిసిందే.

Telugu Bimbisara, Catherine, Kalyan Ram, Dil Raju, Ram Pothineni, Samyukra Menon

కళ్యాణ్ రామ్ కు ఈ సినిమాతో ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాల్సి ఉంది.కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.సినిమాసినిమాకు కళ్యాణ్ రామ్ రేంజ్, మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.ఈ సినిమా హిట్టైతే మాత్రమే బింబిసార2 తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube