బింబిసార మూవీకి ప్లస్, మైనస్ లు ఇవే.. కళ్యాణ్ రామ్ ఖాతాలో హిట్ అంటూ?

కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార మూవీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది.నందమూరి హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని ఈ సినిమా టాక్ ద్వారా అర్థమవుతోంది.

 Bimbisara Movie Plus And Minus Points Details, Bimbisara, Bimbisara Review, Nand-TeluguStop.com

కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది.సోషియో ఫాంటసీ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది.

బింబిసార మూవీ కథ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ బింబిసారుడిగా రాజ్యంలో ఏ మాత్రం మానవత్వం, జాలి, దయ, కరుణ లేకుండా పరిపాలన సాగిస్తుంటారు.అయితే టైమ్ ట్రావెల్ చేయడం ద్వారా ప్రస్తుత కాలానికి వచ్చిన బింబిసార ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులను చూసి మారడంతో పాటు తన రాజ్యంలో ఏ విధంగా పరిపాలన సాగించాడో ఈ సినిమాలో ప్రస్తావించారు.

అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

కళ్యాణ్ రామ్ అభిమానులు కాలర్ ఎత్తుకునే విధంగా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది.

Telugu Bimbisara, Bimbisara Story, Directrovasisth, Nandamurikalyan, Samyukta Me

కళ్యాణ్ రామ్ ఇంట్రడక్షన్ సీన్ అదుర్స్ అని ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ మరింత బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కీరవాణి తన బీజీఎంతో ఈ సినిమాకు ప్రాణం పోశారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే పాటల ప్లేస్మెంట్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Bimbisara, Bimbisara Story, Directrovasisth, Nandamurikalyan, Samyukta Me

విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన సన్నివేశాలు కొన్ని మెప్పిస్తే మరికొన్ని మెప్పించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ రామ్ ఖాతాలో సక్సెస్ చేరడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube