కోట్లు ఉన్నాయి కదా అని శృంగార సామర్థ్యం పెంచుకోవాలని చూశాడు.. చివరకు ఏమైందంటే!

డబ్బు ఎంత ఉన్నా కూడా కొన్నింటిని కొనలేరు అనే విషయం మరోసారి నిరూపితం అయ్యింది.డబ్బుంది కదా అని కొందరు అని నేను అనుకున్నట్లుగా జరగాలి, అద్బుతాలు ఆవిష్కారం అవ్వాలని భావిస్తు ఉంటారు.

 Billionaire Diamond Trader Dies During Penis Enhancement Procedure-TeluguStop.com

కాని అన్ని విషయాల్లో డబ్బు పని చేయదు.చావును ఆపడం, కొన్నింటిని పెంచడం డబ్బువల్ల అయ్యే పని కాదు.

పకృతి సిద్దంగా రావాల్సి ఉంటాయి.వాటిని డబ్బుతో పెంచుకోవాలని ప్రయత్నించడం అవివేకం అవుతుంది.

బెల్జియం దేశానికి చెందిన ఒక వజ్రాల వ్యాపారి డబ్బుంది కదా అని ఎవరు చేయని ప్రయత్నం చేసి చివరకు చనిపోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…
బెల్జియం దేశంలో ఎహుడ్‌ ఆర్కే లానియాడో అనే 65 ఏళ్ల వజ్రాల వ్యాపారి కింది స్థాయి నుండి ఎదిగాడు.

వజ్రాల వ్యాపారంలో కోట్లు ఘడించాడు.ప్రపంచంలోని పలు దేశాలకు తన వజ్రలను సరఫరా చేశాడు.అంతటి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న వజ్రాల వ్యాపారికి అన్ని విషయాల్లో బాగానే ఉంది కాని శృంగారం విషయంలో మాత్రం చాలా అసంతృప్తి ఉండేది.మొదటి నుండి కూడా తన అంగం చిన్నదిగా ఉందని అతడు నిరాశగా బాధపడేవాడట.

ఎన్నో సంప్రదింపులు చేసి, ఎంతో మందితో మాట్లాడిన తర్వాత ఫ్రాన్స్‌ లో తన సమస్యకు పరిష్కారం ఉందని గుర్తించాడు.పురుషాంగం పెద్దగా చేయించుకునేందుకు ఆపరేషన్‌ కు సిద్దం అయ్యాడు.

మగతనం పెంచుకునేందుకు అతడు ప్రముఖ హాస్పిటల్‌కు చేరుకున్నాడు.వైధ్యులు కూడా అతడికి పూర్తి భరోసా ఇచ్చి పురుషాంగం సైజ్‌ పెంచేందుకు సిద్దం అయ్యారు.అంతా సిద్దం అయ్యింది.ఆపరేషన్‌ థియేటర్‌కు వెళ్లారు.దాదాపు అయిదు ఆరు గంటల సమయం పాటు ఆపరేషన్‌ నిర్వహిస్తామని వైధ్యులు చెప్పారు.అందుకు ఓకే చెప్పిన వ్యాపారి ఆపరేషన్‌ థియేటర్‌కు వెళ్లాడు.

ఆపరేషన్‌ జరుగుతున్న సమయంలో అతడికి గుండెపోటు వచ్చింది.పోలీసులు అతడికి కృత్రిమ శ్వాస ఇచ్చేందుకు ప్రయత్నించినా, అతడికి ఎలాంటి మందులు ఇచ్చేందుకు ప్రయత్నించినా కూడా సఫలం కాలేదు.

గుండెపోటుతో ఆయన గుండె ఆగిపోయింది.ఆపరేషన్‌ సమయంలో ఆయన బాగా ఉద్వేగానికి లోనవ్వడం వల్ల గుండె పోటు వచ్చి ఉంటుందని వైద్యులు భావించారు.

మార్చలేనివి, కొనలేనివి డబ్బుంది కదా అని కొనాలని, మార్చాలని ప్రయత్నిస్తే ఇలాగే ఉంటుంది.డబ్బుంది కదా అని విర్రవీగడం ఇందుకే మంచిది కాదని పెద్దలు అంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube