ఆ ఘటన నిజంగా హైదరాబాద్ లో జరిగిందా?

ఇటీవల కాలంలో జరిగే కొన్ని ఘటనల వీడియోలు అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి.ఒకో చోటా జరిగిన వీడియో కాస్త మరో జరిగిన చోటా జరిగినట్టు చెప్పి నానా రచ్చ చేస్తున్నారు.

 Fact Check, Billboard Falling, Motorcyclists, Hyderabad, Pakistan-TeluguStop.com

ఇంకా అలానే ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అది ఏంటంటే? భారీ వర్షాల కారణంగా రోడ్డు పక్కన ఉన్న బిల్‌బోర్డు అమాంతం ఊడిప‌డి వాహ‌న‌దారుల‌పై పడింది.

ఇంకా ఆ ప్రమాదం లో వేరు వేరు బైక్ పై వస్తున్న ఇద్దరు వాహదారులు తీవ్రంగా గాయపడ్డారు.ఇంకా ఈ ఘటన తాలూకు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ ఘటన కాస్తా హైదరాబాద్ లో జరిగినట్టు భారీ స్థాయిలో ప్రచ్చరం జరుగుతుంది.ఈ భయంకర ఘటన హైదరాబాద్ లోని మెహ‌దీప‌ట్నంలో జరిగింది అని ఓ ఫేసుబుక్ యూజర్ పోస్ట్ చేశాడు.

దీంతో ఈ వీడియోను చుసిన నెటిజన్లు అంత ఓ రేంజ్ లో షేర్ చేశారు.అయితే నిజానికి ఈ ఘటన పాకిస్తాన్‌లోని క‌రాచీలో జ‌రిగింద‌ని సమాచారం.

ఈ ఘటన ఈ నెల 6వ తేదీన అక్కడ జరిగినట్టు ”ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్” వెల్లడించింది.ఆ తర్వాత ఆ నగరంలో ఉన్న బిల్‌బోర్డులు అన్ని తొలిగించినట్టు తెలిపారు.

అయితే ఆ ఘటన హైదరాబాద్ లో జరగలేదని తెలంగాణ‌కు చెందిన‌ ఐఏఎస్ అధికారి అర‌వింద్‌ కుమార్ కూడా ట్విట్ చేసారు.

https://www.videogram.com/comic/5a9f2c88-f985-4c9e-becd-5d30f86708cd

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube