ట్రంప్ కి షాక్ ఇచ్చిన... 'ఆ ఇద్దరు'..!!!  

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసాల జారీ విషయంలో అవలంబిస్తున్న చర్యలు అందరికి తెలిసిందే కేవలం వలసదారులే టార్గెట్ అదీ కూడా ముఖ్యంగా భారతీయులే టార్గెట్ గా చేపట్టే వీసాల నిలుపుదల నిభందనలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయిఅంతేకాదు కొన్ని రోజుల క్రితం ట్రంప్ H-4 వీసాపై ఉన్న పని అనుమతిని తొలగించనున్నట్లుగా జీవో జారీ చేశారు

  • Bill To Protect Work Permits Of H4 Visa Holders-Protect Us Congress

    Bill To Protect Work Permits Of H4 Visa Holders

  • అయితే ఆ H-4 వీసాదారులను కాపాడాలంటూ ఇద్దరు సెనేట్సభ్యులు అమెరికన్ కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశపెట్టి ట్రంప్ కి షాక్ ఇచ్చారు H-4 వీసా పొందినవారికి అమెరికాలో పనిచేసే అనుమతి లభిస్తోంది. H1b వీసాదారుల జీవిత భాగస్వామికి అమెరికాలో H-4 వీసాలను ఇస్తున్నారు. ఈ క్రమంలో పని అనుమతి తీసివేయడం వల్ల వారి కుటుంబాలు విడిపోయే ప్రమాదం ఉంది.

  • Bill To Protect Work Permits Of H4 Visa Holders-Protect Us Congress
  • అంతేకాదు ఎంతో మంది ప్రతిభావంతులు అమెరికాని విడిచి వెళ్ళడం వలన ఆర్ధికంగా కూడా అమెరికా నష్టపోయే అవకాశం ఉందని అన్నాజీ ఎషో, జోయ్ లాఫ్ గ్రెన్ లు ఈ బిల్లులో పేర్కొన్నారు. కాగా H-4 వీసా రద్దుప్రభావం ముమ్మాటికీ వలసదారులపై పడుతుందని వారు అమెరికన్ కాంగ్రెస్ లో H-4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు…మరి ఈ బిల్లు పై ట్రంప్ ఎలా ముందుకు వెళ్తారో వేచి చూడాలి.