పిల్లిపై జాలి పడ్డందుకు ఆమె 35 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది.. చనిపోయినా బాగుండేదని బాధపడింది

కొన్ని సార్లు పాపం అని పోతే మనని పాపం అనే దిక్కు ఉండదు.అంటే మనం ఎవరికి అయినా సాయం చేసేందుకు వెళ్లినప్పుడు మనకు ఆపద రావడం, ఆ సమయంలో మనకు సాయం చేసేందుకు ఎవరు రాకపోవడం జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి.

 Bill Of The Month Rabies Treatment After Cat Bite 50000 Dollors-TeluguStop.com

ఇప్పుడు అమెరికాకు చెందిన జానెట్‌ పార్కర్‌ అనే మహిళ శాస్త్రవేత్తకు అదే జరిగింది.ఒక మంచి చేయాలని ఆమె అనుకుంటే ఆమెకు జరిగిన విషయం అత్యంత బాధ కరం.ఇంత ఇబ్బంది కంటే చనిపోతే బాగుండేది కదా అని ఆమె బాధపడేలా పరిస్థితి మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… అమెరికా ఫ్లారిడాలోని జానెట్‌ పార్కర్‌ అనే మహిళ జీవశాస్త్రవేత్త.

ఆమె జంతువుల పట్ల చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉంటారు.ఆమె ఇంట్లో పలు పెంపుడు జంతువులు ఉండేవి.

ఆమె కొన్నాళ్ల క్రితం ఇంట్లో ఉండగా బయట ఒక పిల్లి చాలా హృదయ విదారకంగా మ్యావ్‌ మ్యావ్‌ అంటూ మొత్తుకుంటుంది.ఆ పిల్లి చప్పుడు జానెట్‌ పార్కర్‌కు బాధను కలిగించింది.

అయ్యో అని పిల్లికి సాయం చేయాలని వెళ్లింది.ఒక మూలకు నక్కి ఉన్న పిల్లిని ఆమె చూసింది.

ఆ పిల్లిని చూస్తే ఆకలిగా ఉందనిపించింది.అందుకే వెంటనే తన ఇంట్లో ఉన్న ఒక చేప ముక్కను ఆ పిల్లికి ఇవ్వాలని భావించింది.

ఇంట్లోకి వెళ్లి చేప ముక్కను పిల్లి కోసం తీసుకు వచ్చింది.పిల్లికి ఆ ముక్కను తినిపించేందుకు జానెట్‌ ప్రయత్నించగా ఆ పిల్లి మరే ఉద్దేశ్యంతో భావించిందో కాని చేతిని కొరికింది.

జానెట్‌ చేతిపై పిల్లి పంటి గుర్తులు పడటంతో పాటు కొద్ది పాటి రక్తం కూడా వచ్చింది.

పిల్లి కాటు ప్రమాదంగా భావించిన జానెట్‌ స్థానిక హాస్పిటల్‌కు వెళ్లింది.అక్కడ ర్యాబిస్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ వేయించుకోవలనుకుంది.కాని ఆ హాస్పిటల్‌లో ర్యాబిస్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ లేదని చెప్పారు.

దాంతో ఆమె ఒక పెద్ద హాస్పిటల్‌కు వెళ్లింది.అక్కడ హాస్పిటల్‌లో చికిత్స పొంది, వ్యాక్సిన్‌ కూడా తీసుకుంది.ఆ తర్వాత బిల్లు చూస్తే ఆమె గుండె బరువెక్కింది.50 వేల డాలర్ల బిల్లును ఆమెకు విధించారు.అంటే మన కరెన్సీలో 35 లక్షలకు పైగానే అన్నమాట.అంత బిల్లు చూసి ఆమె బిత్తర పోయింది.ఒక వేళ నేను చనిపోయి ఉంటే నా అంత్యక్రియలకు కూడా ఇంతకంటే తక్కువే అయ్యేవి కదా అని బాధపడిందట.వెక్సిన్‌ వేయించుకోకుండా చనిపోయినా బాగుండేది కదా అని ఆవేదన వ్యక్తం చేసింది.

ఏదోలా బిల్లు పే చేసి బయట పడింది.పిల్లికి పాపం అని చేపను పెట్టేందుకు ప్రయత్నించి 35 లక్షలు వదిలించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube