ఆ శునకం చేసిన పనికి యజమానికి వేలల్లో బిల్లు..!  

bill in thousands to the owner of dog, dog, london, 26 thousands, viral video, facebook, viral latest, bill - Telugu 26 Thousands, Bill, Dog, Facebook, London, Viral Latest, Viral Video

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇంట్లో పెట్స్ ను పెంచుకుంటూ మూగ జీవులపై వారి ప్రేమను వ్యక్త పరుస్తుడం మనం గమనిస్తూనే ఉన్నాం.ఇందులో ఎక్కువ శాతం కుక్కలను పెంచుకోవడంతో పాటు ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ట్రీట్ చేయడం మనం గమనిస్తూనే ఉంటాం.

TeluguStop.com - Bill In The Thousands To The Owner For The Work Done By That Dog

అంతేకాకుండా సాధారణంగా మనిషి కుక్కలు చాలా మంచి స్నేహితులు అని అందరూ అంటుంటారు. దీనికి కారణం మనుషుల మాటలను, వారి భావాలను కూడా కుక్కలు బాగా అర్థం చేసుకుంటాయి.

ఒకవేళ ఆ కుక్క యజమాని సంతోషంగా ఉంటే కుక్క కూడా సంతోషం వ్యక్తం చేస్తూ.ఒకవేళ ఆ యజమాని బాధగా ఉంటే అది కూడా బాధను వ్యక్తం చేస్తూ ఉండడం మనం చూసే ఉంటాం.

TeluguStop.com - ఆ శునకం చేసిన పనికి యజమానికి వేలల్లో బిల్లు..-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా ఒక కుక్క తన యజమాని కాలుకి దెబ్బ తగిలితే సానుభూతి చూపించే క్రమంలో ఆ యజమానికి ఏకంగా 26 వేల రూపాయలు ఖర్చు అయింది.ఇంతకు ఎందుకంత ఖర్చయిందని అనుకుంటున్నారా.? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.లండన్ లో ఉండే రస్సెల్ జోన్స్ అనే వ్యక్తికి ఇటీవల కాలంలో కాలు కాస్త గాయం అయింది.

చికిత్సలో భాగంగా వైద్యులు కాళ్లకు కాస్తా కట్టు కట్టారు.రస్సెల్ ఎప్పుడైనా బయటకు వెళ్తే కర్ర సహాయంతో నడుచుకుంటూ బయట వెళ్లేవాడు.అతడితో పాటు అతని పెంపుడు కుక్క కూడా బయటకు వెళ్ళేది.ఇది ఇలా ఉండగా తన యజమాని కుంటడం గమనించిన కుక్క (బిల్) కూడా కుంటడం మొదలు పెట్టింది.

దింతో రస్సెల్ కుక్కకు కాలికి ఏమైనా గాయం అయిందని కంగారుపడి వెంటనే హాస్పిటల్ కు  తీసుకుని వెళ్లి ఇతర పరీక్షలు నిర్వహించారు.వైద్యులు ఆ కుక్క కు ఎలాంటి గాయాలు కాలేదని తెలియజేశారు.ఆ తర్వాత hustle కదా రస్సెల్ కు అర్థం అయ్యింది.అది కుక్క తన పై చూపిన సానుభూతి అని.కుక్క చూపిన సానుభూతి కు రస్సెల్ ఎంతో ఆనందపడ్డాడు.కుక్క కాలు వైద్య పరీక్షకు ఏకంగా 26 వేల రూపాయలు ఖర్చయింది.

ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశాడు.ఈ వీడియోలో చూపించిన ప్రేమ ఆప్యాయతకు నెటిజెన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

#London #Viral Video #26 Thousands #Bill #Facebook

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు