ఇవి మీకు తగదు.. అలాంటివి మానుకోండి: ‘‘ ఆమె ’’తో సంబంధాలపై బిల్‌గేట్స్‌కు ముందే హెచ్చరిక

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఆయన సతీమణి మెలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి ఆగస్టు మొదటి వారంలోనే అధికారికంగా తెరప‌డింది.మెలిండా ద‌ర‌ఖాస్తు చేసుకున్న విడాకుల‌కు కోర్టు ఆమోదం తెలిపింది.

 Bill Gates Warned In 2008 Over 'inappropriate Emails' To Female Employee , Billg-TeluguStop.com

దీంతో బిల్‌గేట్స్ ఇప్పుడు ఒంటరివాడు అయిపోయారు.తాము విడిపోతున్న‌ట్లు గేట్స్ దంప‌తులు మే నెల‌లోనే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అనంతరం వాషింగ్ట‌న్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మెలిండా గేట్స్ విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.దీనిని పరిశీలించి విచారణ జరిపిన న్యాయమూర్తి విడాకులకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సంస్థలోని ఓ మహిళా ఉద్యోగితో కొన్నేళ్ల క్రితం బిల్‌ గేట్స్‌ లైంగిక సంబంధాలు కొనసాగించారని.దీనిపై బోర్డు మూడో సంస్థతో విచారణ చేయించిందని కథనాలు వెలువడ్డాయి.ఈ కారణం చేతనే ఆయన బోర్డు నుంచి వైదొలిగినట్లు మైక్రోసాఫ్ట్‌ అధికారిక వర్గాలే వెల్లడించినట్లు ఆ కథనాల సారాంశం.ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా, మెలిండాకు 56 ఏళ్లు.

అత్యంత చిన్నవయసులోనే మైక్రోసాఫ్ట్‌ను స్థాపించిన బిల్‌గేట్స్‌.ఆ సంస్థకు సీఈవోగా ఉన్నప్పుడు 1987లో మెలిండా ప్రొడక్ట్‌ మేనేజరుగా చేరారు.

అప్పట్లో ఆ సంస్థలో చేరిన ఏకైక ఎంబీఏ మహిళా గ్రాడ్యుయేట్ ఆమే కావడం విశేషం.ఆ తర్వాత ఇరువురూ ఒకరినొకరు ఇష్టపడటంతో 1994లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు.

Telugu Billgates, County, Melinda Gates, Wallstreet, Washington-Telugu NRI

అయితే మహిళా ఉద్యోగితో లైంగిక సంబంధాలపై బిల్‌గేట్స్‌ను 2008లోనే కంపెనీ హెచ్చరించినట్లు తాజాగా అమెరికన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.2007 ఆ మధ్యకాలంలో బిల్‌గేట్స్‌ .మైక్రోసాఫ్ట్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.ఆ సమయంలో ఓ మహిళా ఉద్యోగికి ఈ-మెయిళ్లు పంపడం.

తనను వ్యక్తిగతంగా కలవాలని కోరడం వంటి విషయాలు కంపెనీ బోర్డు దాకా వెళ్లాయి.ఇది మీ స్థాయికి తగిన ప్రవర్తన కాదని, ఇలాంటివి మానుకోవాలని మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుల బృందం గేట్స్‌ను హెచ్చరించింది.

ఈ-మెయిళ్లు పంపిన విషయాన్ని గేట్స్‌ సైతం అంగీకరించారని, భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయనని ఆయన బోర్డుకు తెలిపినట్లు ప్రముఖ దినపత్రిక వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొంది.గేట్స్‌పై వివరణ వల్లే బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది.

ఈ కథనాన్ని మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి కూడా ధ్రువీకరించారని సమాచారం.కాగా.

ఈ-మెయిళ్ల విషయం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత బిల్‌‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube