యువతకు బిల్ గేట్స్ విలువైన సలహాలు... అవేంటంటే?

బిల్ గేట్స్ అపర కుబేరుడిగా ప్రపంచానికి పరిచయం అక్కర లేని వ్యక్తి.ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి ప్రపంచ అత్యంత ధనవంతుడిగా చరిత్ర సృష్టించిన బిల్ గేట్స్ జీవితం ఎంతో మందికి ఆదర్శం.

 Bill Gates' Valuable Advice To Young People Aventante, Billgates Suggestions, Bi-TeluguStop.com

ఎక్కడ ఎవరి గురించైనా స్పూర్తిదాయక ప్రసంగం ఇవ్వాలంటే బిల్ గేట్స్ పేరును ఉదాహరణగా తీసుకొని ప్రస్తావిస్తారంటే బిల్ గేట్స్ స్థాయి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు.అంతేకాక గేట్స్ ఫౌండేషన్ ద్వారా వేలకోట్లు ప్రపంచంలో రకరకాల దేశాలలో ప్రజలకు, విద్యార్థులకు సహాయపడుతున్నారు.

అయితే బిల్ గేట్స్ అంత ఎత్తుకు ఎదిగినా ఎటువంటి హడావిడి లేకుండా సాధారణ వ్యక్తిలా జీవించడం బిల్ గేట్స్ నుండి ప్రస్తుత యువత నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎంతో మంది మేధావులు రకరకాల సందర్భంలో చెబుతూ ఉంటారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే ఓ కార్యక్రమంలో పాల్గొన్న బిల్ గేట్స్ ఆస్క్ మి ఎనీ థింగ్ అనే సెషన్ లో ప్రసంగించిన గేట్స్ యువతకు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది.

అయితే కర్బన్ ఉద్గారాలను తగ్గించడానికి యువత రకరకాల మార్గాలను అన్వేషించాలని బిల్ గేట్స్ తెలిపాడు.నేను ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే వాడుతున్నానని, మా ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశానని అన్నారు.

అయితే సగటు యువకుడికి మీరిచ్చే సలహా ఏంటని అడగగా, యువత మీరు కోరుకునే ఉద్యోగాన్ని పొందితే ఆస్వాదించాలని, అప్పుడే మీలో ఉన్న సత్తా బయటికి వస్తుందని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube