ట్రంప్ అసమర్డుడు కాబట్టే….బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు..!!!  

Trump\'s partial travel ban made coronavirus Pandemic worse, Says Bill Gates, Bill Gates on Trump, Trump Protesters, joe Biden, America Elections, Democratic party - Telugu America Elections, Bill Gates On Trump, Democratic Party, Joe Biden, Says Bill Gates, Trump Protesters, Trump\\'s Partial Travel Ban Made Coronavirus Pandemic Worse

అమెరికాలో అధ్యక్ష్య ఎన్నికల ప్రచారం జోరందుకుంది.ప్రతిపక్ష డెమోక్రటిక్ , అధికార రిపబ్లికన్ పార్టీలు నువ్వా నేనా అనేట్టుగా విమర్శలు చేసుకుంటున్నాయి.

TeluguStop.com - Bill Gates Trump Rules Coronavirus Pandemic

వాడి వేడిగా ప్రసంగాలు చేస్తూ అసలు సిసలైన అమెరికా రాజకీయాలను కళ్ళముందు చూపిస్తున్నాయి.డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్ధి బిడెన్ కి మద్దతుగా పార్టీలో సీనియర్స్ అందరూ ట్రంప్ పై ముప్పేట దాడి చేస్తున్న సమయంలో ట్రంప్ ను పార్టీతో సంభందం లేని వ్యక్తులు, అమెరికా రాజకీయాలను ప్రభావితం చేయగల సమర్ధులు సైతం విమర్శలతో ఎకేస్తున్నారు.తాజాగా

ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా ట్రంప్ ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికాలో కరోనా పరిస్థితిపై రోజుకో వ్యాఖ్యలు చేస్తూ, వ్యాక్సిన్ త్వరతగతిన రావాలని,కేవలం, వ్యాక్సిన్ మాత్రమే అమెరికా ప్రజలను రక్షించగలదని కొన్ని నెలలుగా వ్యాఖ్యానిస్తున్న బిల్ గేట్స్ తాజాగా అమెరికా ప్రజల ముందు ట్రంప్ ని దోషిగా నిలబెట్టారు.

TeluguStop.com - ట్రంప్ అసమర్డుడు కాబట్టే….బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం కరోనా వల్ల వచ్చిన సంక్షోభానికి ఏకైక కారకుడు ట్రంప్ మాత్రమేనని డిసైడ్ చేసేశారు.

అధ్యక్షుడిగా ట్రంప్ కరోనా కాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని, ముందుగా అలెర్ట్ అయ్యి ఉంటే ఎంతో మంది అమెరికన్స్ బ్రతికి ఉండేవారని అన్నారు.

ట్రంప్ అసమర్దత వలనే కరోన సమయంలో ప్రయాణాల విషయంలో విధించాల్సిన ఆంక్షలు విధించలేదని ఈ కారణంతోనే అమెరికాలో కరోనా మహమ్మారి విస్తృతం అయ్యిందని, వివిధ దేశాలలో ఉన్న అమెరికన్స్ అందరూ ఒకే సారి అమెరికా రావడం వలన అక్కడ వారికి సోకినా కరోనా మహమ్మారిని అమెరికాకి తీసుకువచ్చారని.సరైన నిభందనలు ట్రంప్ అమలు చేసి ఉంటే అమెరికా ఇంతటి భారీ మూల్యం చెల్లించుకునేది కాదని ఆయన విమర్శించారు.

అయితే బిల్ గేట్స్ చేసిన ఈ వ్యాఖ్యలు డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉన్నాయని , ఆయనచే బిడెన్ వర్గం మాట్లాడించి ఉంటుందని ట్రంప్ మద్దతు దారులు ఎదురు దాడి చేస్తున్నారు.

#Trump'sPartial #BillGates #Says Bill Gates #Joe Biden

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bill Gates Trump Rules Coronavirus Pandemic Related Telugu News,Photos/Pics,Images..