48ఏళ్ల క్రితం తయారుచేసుకున్న రెజ్యుమేను షేర్ చేసిన బిల్ గేట్స్!

బిల్ గేట్స్.పరిచయం అక్కర్లేని పేరు.అతని అసలు పేరు చాలా తక్కువమందికి తెలుసు.మూడవ విలియం హెన్రీ గేట్స్ అందరికీ బిల్ గేట్స్ గానే సుపరిచితుడు.మన మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత, వ్యక్తిగత ఉపయోగాలకోసం వినియోగించే కంప్యూటర్లను సామాన్యులకు అందుబాటులో తెచ్చిన మహనీయుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నొ దానాలు, సహాయాలు చేసిన దానకర్ణుడు బిల్ గేట్స్.

 Bill Gates Shared The Resume Made 48 Years Ago, , Bill Gates, Resume , Social Media, Viral Latest, News Viral , William H Gates,head Of Microsoft Company,bill Gates Shared The Resume, Resume Made 48 Years Ago-TeluguStop.com

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్న బిల్ గేట్స్ తాజాగా ఓ అందమైన అనుభూతిని అందరితో పంచుకున్నాడు.అదే అతను 48ఏళ్ల క్రితం తయారుచేసుకున్న రెజ్యుమే.

అవును.బేసిగ్గా రెజ్యుమేను చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలోకి చేరాలనుకునేవారు మొదట ఈ రెజ్యూమ్‌ ప్రిపేర్‌ చేసుకుంటారు.ఆరకంగా మన బిల్ గేట్స్ కూడా తన కెరీర్ తొలినాళ్లలో ఓ రెజ్యుమె ప్రిపేర్ చేసుకున్నారు.అపర కుబేరుడైన బిల్ గేట్స్ రెజ్యుమె చూడాలని ఎవరికుండదు.

 Bill Gates Shared The Resume Made 48 Years Ago, , Bill Gates, Resume , Social Media, Viral Latest, News Viral , William H Gates,Head Of Microsoft Company,Bill Gates Shared The Resume, Resume Made 48 Years Ago-48ఏళ్ల క్రితం తయారుచేసుకున్న రెజ్యుమేను షేర్ చేసిన బిల్ గేట్స్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి ఆ ఆలోచన బిల్ గేట్స్ కి వచ్చిందేమో తెలియదు గాని, తాజాగా తాను మొదట ప్రిపేర్ చేసుకున్న ఓ రెజ్యుమె ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.సదరు రెజ్యుమే చూసి నెటిజన్లు ఒకింత భావోద్వేగానికి లోనవుతున్నారు.

కింద ఫొటోలో సదరు కాపీని మీరు గమనించవచ్చు.

Telugu Gates, Gatesshared, Resume, Latest, William Gates-General-Telugu

దాన్ని బిల్ గేట్స్ షేర్ చేస్తూ.“మీరు డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులైనా, లేదా కాలేజీ చదువుల్ని మధ్యలోనే ఆపేసిన వారైనా కానీ.మీ రెజ్యూమ్‌ 48 ఏళ్ల క్రితం నాటి నా రెజ్యూమ్‌ కంటే కచ్చితంగా బెటర్‌గానే ఉంటుందని భావిస్తున్నా!” అంటూ ఎంతో వినమ్రంగా రాసుకొచ్చారు.

దీంతో ప్రస్తుతం ఆయన పోస్టు వైరల్‌గా మారింది.ఇకపోతే, బిల్‌గేట్స్‌ ప్రఖ్యాత హార్వర్డ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో ఈ రెజ్యూమ్‌ను తయారు చేసుకోవడం జరిగింది.ఇందులో ఆయన పేరు విలియం హెచ్‌ గేట్స్‌గా ఉంది.ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్, డేటాబేస్ మేనేజ్‌మెంట్, కంపైలర్ కన్‌స్ట్రక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటి కోర్సులను తాను నేర్చుకున్నట్టు అందులో తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube