అమెరికా అధ్యక్షుడుపై బిల్ గేట్స్ అసంతృప్తి! అదే స్థానంలో తనుంటే  

Bill Gates on Trump call for quick end to lock down, Corona Virus, COVID-19, America President Trump - Telugu America President Trump, Bill Gates On Trump Call For Quick End To Lock Down, Corona Virus, Covid-19

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలని వణికిస్తుంది.అన్ని దేశాలు ఈ వైరస్ ని నియంత్రించేందుకు పోరాటం చేస్తున్నాయి.

TeluguStop.com - Bill Gates On Donald Trump Call For Quick End To Lock Down

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.ఇందులో ఇండియా కూడా ఏకంగా 21 రోజులు లాక్ డౌన్ లోకి వచ్చేసింది.

TeluguStop.com - అమెరికా అధ్యక్షుడుపై బిల్ గేట్స్ అసంతృప్తి అదే స్థానంలో తనుంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

కరోనాని నియంత్రించే క్రమంలో ప్రజలని ఇళ్లకే పరిమితం చేస్తున్నారు.ఈ లాక్ డౌన్ తో చాలా వరకు కరోనా వ్యాప్తిని నియంత్రించగలుగుతున్నారు.

ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో కూడా కరోనా పోజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది.మృతులు కూడా వందలలో ఉన్నారు.

అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇంకా దేశంలో లాక్ డౌన్ తీసుకురాలేదు.ఇది సాధ్యం కాదని కూడా చెబుతున్నాడు.

దీనిపై చాలా మంది ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ట్రంప్‌ను పరోక్షంగా ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండుంటే కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అమెరికా మొత్తం షట్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇళ్లలోనే ఉంచేవాడినని అన్నారు.చైనాలో ఆరు వారాల పాటు పటిష్టమైన కట్టడిని అమలు చేశారని, అమెరికా కూడా ఇలానే సిద్దపడి మరింత చాకచక్యంగా అమలు చేయాలని బిల్‌ గేట్స్ అన్నారు.

ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటే 20 రోజుల్లోనే దేశంలో మార్పు కనపడుతుందన్నారు.దీనికి సంబంధించి ప్రజలకు ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

మరి బిల్ గేట్స్ వాఖ్యలపై ట్రంప్ ఎలా స్పందిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#Corona Virus #COVID-19 #BillGates

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bill Gates On Donald Trump Call For Quick End To Lock Down Related Telugu News,Photos/Pics,Images..